మానవ శరీరానికి చాలా రకాల విటమిన్లు అవసరమవుతాయి.ఏ విటమిన్ లోపించిన మానవ శరీరానికి అనేక రకాల రోగాలు దాడి చేసే అవకాశం ఉంది.
మానవ శరీరానికి అన్ని విటమిన్లు రోగాల నుంచి కాపాడుతూనే ఉంటాయి.అందులో చాలా ముఖ్యమైన విటమిన్ డి.
అసలు ఈ విటమిన్ మనకు ఎలా లభిస్తుంది అంటే శరీరం పై డి విటమిన్ చూపించే ప్రభావం ఏమిటి? డి విటమిన్ తగినంత లేకపోతే ఏమవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని విటమిన్లలోకెల్లా డి విటమిన్ ఎంతో ముఖ్యమైనది.
ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.శరీరానికి అత్యంత ముఖ్యమైన డిటు పెంచడమే కాకుండా డి త్రి విటమిన్స్ కాంప్లెక్స్ ను తయారుచేస్తుంది.
సాధారణంగా ఆహార పదార్థాలకంటే సూర్యరష్మి నుంచి డి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.అందుకే డి విటమిన్ సూర్యరష్మీ విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
నిజానికి మనకు కావాల్సిన అన్ని విటమిన్స్ మనం తినే ఆహార పదార్థం ద్వారా లభిస్తూనే ఉంటాయి.కానీ డి విటమిన్ ఎక్కువగా లభించే ఫుడ్స్ చాలా తక్కువ.
అంతే కాకుండా విటమిన్ డి బాగా అందాలంటే ప్రతి రోజు సూర్యరష్మీకి మించినది మరొకటి లేదని వైద్యులు చెబుతున్నారు.సూర్యరష్మీ తో మన శరీరంలోని కొవ్వు కరుగుతుంది అని చెబుతూ ఉంటారు.
అందుకే రోజుకు కనీసం 30 నిమిషాలు అయిన ఎండలో ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

ఇలా చేస్తే మన శరీరానికి కావాల్సిన డి విటమిన్ దొరుకుతుందని కూడా చెబుతూ ఉంటారు.అలా అని గంటల పాటు ఎండలో ఉన్న ప్రమాదమే అని చెబుతున్నారు.మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనంగా మారిపోతాయి.
అంతేకాకుండా క్యాన్సర్, బోలో, క్షయ, జుట్టు రాలడం, స్థూలకాయం సమస్యలు పెరుగుతాయి.క్షయ నుంచి త్వరగా కోలుకునేందుకు విటమిన్ డి ఎంతో అవసరం.

సామాన్యులతో పోలిస్తే గర్భిణీ మహిళలలో విటమిన్ డి మరింత ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.గర్భిణీలు తప్పకుండా ఎండలో కాసేపు ఉండాలని అలా ఉండడం వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటుందని వెల్లడించారు.దీని ద్వారా పుట్టే పిల్లలు చాలా తక్కువ అనారోగ్య సమస్యలతో ఉంటారని వెల్లడించారు.డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే శరీరంలో తగినంత విటమిన్ డి కచ్చితంగా ఉండాలి.