కోడికత్తి కేసులో శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది.నిందితుడు శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు రద్దు చేసింది.అదేవిధంగా కేసును ఈనెల 31కి వాయిదా వేసింది.
31వ తేదీ అనంతరం కేసు విచారణ మొదలవుతుందని కోర్టు తెలిపింది.అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో నిందితుడు శ్రీనివాస్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.ఆ క్రమంలో నిందితుడిని సంఘటనా స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







