జయలలిత, ఎన్టీఆర్ ఇద్దరు సినిమా రంగం లో ఉత్స స్థాయికి చేరుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వారి మాతృ రాష్ట్రానికి ఏళ్ళ తరబడి సేవలందించారు.వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగు, తమిళ ప్రేక్షకులకు అందించారు.అయితే ఎన్టీఆర్, జయలలిత కలిసి నటించిన కథానాయకుడు సినిమాకు మాత్రం ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంది.
ఈ సినిమాకు గోపాల కృష్ణ నిర్మాతగా వ్యవహరించగా, కె.హేమాంబరధరరావు దర్శకుడిగా పని చేసారు.ఇక ఈ చిత్ర విశేషాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ఈ సినిమాలో క్రమశిక్షణ కలిగిన ఒక యువకుడిగా నటిస్తే, అతడిని ఆరాధించి ప్రేమించే పాత్రలో జయ లలిత నటించారు.
ఈ సినిమా లో ఒక రెండు పాటలను అప్పట్లో కలర్ లో తీశారు.
ఆ సమయంలో ఒక కలర్ పాట రావడం నిజంగా సంచలనమే.ఇక ఈ సినిమా కోసం నిర్మాత సైతం ఎక్కడ ఖర్చుకు వెనకాడలేదు.
ఏకంగా ఒక పాట కోసం 40 వేల రూపాయలను ఖర్చు చేసి ఒక సెట్టు వేసి షూటింగ్ చేసారు.ఆలా ఒక సినిమా కోసం సెట్ వేయడం ఆ తర్వాతే ట్రేండింగ్ గా మారింది.
ఆ సెట్టును చూడటానికి మిగతా దర్శక నిర్మాతలు సైతం తరలి వచ్చేవారు.షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక పాట కోసం ప్యాచ్ వర్క్ చేయాల్సి వచ్చింది.
అయితే అప్పటికే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.దాంతో మూడు రోజుల పాటు సదరు ప్యాచ్ వర్క్ కోసం ఎన్టీఆర్ మరియు జయలలిత డేట్స్ ని తీసుకున్నారు.

మొత్తంగా 52 బిట్లు ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది.సరిగ్గా జయలలిత డేట్స్ ఇచ్చిన టైం లో తమిళ ముఖ్యమంత్రి అన్నాదురై కన్ను మూసారు.అప్పటికే జయలలిత రాజకీయాల్లో కూడా బిజీ గా ఉన్నారు.ఆ సమయంలో తమిళనాడు అట్టుడుకుతోంది.రాష్ట్రంలో అంతటా బంద్ కొనసాగుతుంది.దాంతో జయలలిత కూడా అన్నాదురై అంత్యక్రియల్లో పాల్గొని అవి ముగిసే వరకు షూటింగ్ కి రాలేని పరిస్థితి నెలకొంది.
అప్పటికే ఎన్టీఆర్ మేకప్ తో రెడీ గా ఉన్నారు.ఓ వైపు సమయం మించిపోతుంది.
ఎన్టీఆర్ ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తున్నారు.జయలలిత అంత్యక్రియలను ముగించుకొని షూటింగ్ కోసం ప్రారంభం అయ్యింది.

అప్పటికే సమయం మూడు అయ్యింది.టీ నగర్ నుంచి బీచ్ వరకు కాలినడకన చేరుకుంది జయలలిత.రాత్రి 12 లోపు షూటింగ్ పూర్తి చేయాలి .ఆ రోజు దాటితే ఎన్టీఆర్ డేట్స్ మరో ఆరు నెలలు లేవు.అందుకే నిర్మాత గోపాల కృష్ణ ఛాయా గ్రాహకుడు అయినా స్వామిని అర్ద రాత్రి లోగ షూటింగ్ పూర్తి చేస్తే ఒక కారు బహుమతిగా ఇస్తా అని చెప్పడం తో రెట్టించిన ఉత్సాహం తో అయన షూటింగ్ పూర్తి చేసారు.జయలలిత ప్రోత్సాహం కూడా తోడవ్వడం తో సినిమా అనుకున్న టైం కి విడుదల అయ్యి ఘన విజయం సాధించింది.