సీతారాముల వారి కళ్యాణం జరిగిన ప్రదేశం ఇదే..!

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య( Ayodhya ) అనే దాదాపు చాలా మందికి తెలుసు.సీత దేవి జన్మస్థలం మిథిలానగరం అని చాలా మందికి తెలియదు.

 Sri Rama Navami 2024 Sita Rama Kalyanam In Janaki Mandir Details, Sri Rama Navam-TeluguStop.com

జనకమహారాజు పాలించిన రాజ్యమే మిథిలా నగరం. బీహార్ నుంచి నేపాల్ వరకు మిథిలా రాజ్యం విస్తరించి ఉంది.

దీనినే విదేహ రాజ్యం అని కూడా అంటారు.అందుకే సీతాదేవి ( Sitadevi ) మరో పేరు వైదేహి.

అప్పట్లో జనక మహారాజు ఉన్న రాజధానే ప్రస్తుతం నేపాల్ లో ఉన్న జనక్ పూర్.ఈ జనక్ పూర్ లోనే యాగం చేసేందుకు భూమి దున్నుతుండగా సీతాదేవి ఉద్భవించింది.

ఈ రాజ్యాన్ని విదేహ రాజ్యం అని కూడా పిలుస్తారు.ఆ పేరు మీదే సీతాదేవికి వైదేహి అనే పేరు వచ్చింది.

Telugu Ayodhya, Janaki Mandir, Janakpur, Nepal, Sita Devi, Sri Rama, Sri Rama Na

అప్పట్లో జనకుడు ఉన్న రాజధానే ప్రస్తుతం నేపాల్ లో ఉన్న జనక్పూర్( Janakpur ) అని ప్రజలు నమ్ముతారు.భూమిని దున్నుతుండగా సీతాదేవి ఉద్భవించిన నగరం రామయ్య ను( Ramaiah ) పెళ్లి చేసుకున్న నగరం కూడా ఇప్పటి జనక్ పూర్ అని ప్రజలు నమ్ముతారు.సీతాదేవి జన్మించిన ప్రాంతం ఇదేనన్న విషయం కాలక్రమమైన చాలామంది ప్రజలకు గుర్తులేదు.అందుకే ఈ మధ్య సీతాదేవి జన్మస్థలంపై ఎన్నో రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి.సుర్కిశోర్దాస్ అనే సన్యాసికి 1657లో నేపాల్లో( Nepal ) జనక్పూర్ లో సీతాదేవి విగ్రహాలు లభించడంతో అక్కడున్న ప్రజలు తమ చరిత్రను తిరిగి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు.

Telugu Ayodhya, Janaki Mandir, Janakpur, Nepal, Sita Devi, Sri Rama, Sri Rama Na

ఆ చరిత్రకు చిహ్నంగా 1910 లో వృషభను అనే నేపాల్ రాణి జానకి మందిర్( Janaki Mandir ) పేరుతో ఒక దేవాలయాన్ని నిర్మించారు.వేల గజాల విస్తరణంలో 150 అడుగుల ఎత్తున ప్రాకారంతో పారరాతి గోడలు, అద్దాల మెడలతో నిర్మించిన ఈ దేవాలయానికి అప్పట్లోనే తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అయింది.అందుకే ఈ దేవాలయానికి నౌ లాఖ్ మందిర్ అని పేరు ఉంది.

ఈ ప్రదేశంలోనే సీతమ్మ శివ ధనస్సుని పూజించిందని చెబుతారు.అందుకే జానకి మందిరం నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపన్ని నిర్మించారు.

ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో సీతారామ కళ్యాణం( Sita Rama Kalyanam ) నిర్వహిస్తారు.నౌ లాఖ్ మందిర్ లో సోదరులు భార్యతో సహా కొలువైన రాముడిని దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులు తరలివస్తారు.శ్రీరామనవమి, దసరా, సంక్రాంతి, వివాహ పంచమి సమయంలో భారీగా భక్తజనం ఈ దేవాలయానికి వస్తారు.నేపాల్ వెళ్లే హిందూ ప్రజలంతా ఈ దేవాలయాన్ని కచ్చితంగా దర్శించుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube