శుక్రవారం రోజు ఉప్పు దీపాన్ని ఇలా వెలిగిస్తే ధనవంతులవడం ఖాయం..

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు.ఈ ఒక్క పరిహారాన్ని చేస్తే చాలు మీకు డబ్బే డబ్బు.

 If You Light A Salt Lamp Like This On Friday, You Will Be Rich , Light A Salt La-TeluguStop.com

శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఉప్పు దీపం వెలిగించడం ఎంతో మంచిది.ఆ దీపాన్ని ఎలా,ఎప్పుడు వెలిగించాలి.

దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రవారం రోజు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలి.

అందుకోసం రెండు పెద్ద ప్రమిదలు కావాల్సి ఉంటుంది.చాలా పెద్దవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి.

నిత్యం దీపారాధనలో ఉపయోగించేటువంటి చిన్న ప్రమిదలు కాకుండా పెద్ద ప్రమిదలు రెండు తీసుకోవాల్సి ఉంటుంది.ఆ రెండిటిని శుభ్రంగా కడిగే పసుపు, కుంకుమ రాసిన తర్వాత నేల మీద చిన్న ముగ్గు వేసి పసుపు, కుంకుమ వేసి ఆ ముగ్గు మీద ఆ రెండు ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టాలి.

అప్పుడు పై ప్రమిదలో ఒక పావు కిలో రాళ్ల ఉప్పును వేయాలి.రాళ్ల ఉప్పు ఎంతో శక్తివంతమైనటువంటి అనేక దోషాలను తొలగిస్తుంది.ఈ రాళ్ల ఉప్పుని ఆ పై ప్రమీదలో వేసి ఉప్పు మీద పసుపు, కుంకుమ చల్లాలి.ఆ తర్వాత ఈ ఉప్పు రాసి మీద ఒక చిన్న ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదకి కూడా పసుపు, కుంకుమ రాసి ఆ ప్రమిదలో నూనె కానీ, నెయ్యి కానీ వేసి రెండు వత్తులను ఒక ఒత్తుగా చేసి దీపాన్ని వెలిగించాలి.

ఇది ఉప్పు దీపాన్ని వెలిగించేటువంటి ప్రక్రియ.ఆ తర్వాత పండ్లు కానీ, పాలు కానీ, పటిక బెల్లం కానీ, కొబ్బరికాయ కానీ ఏదైనా నివేదనగా పెట్టీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మనస్పూర్తిగా వేడుకోవాలి.ఆ తర్వాత సంకల్పం చెప్పుకోనీ మీరు ఏ కష్టం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారో కోరుకోవాలి.ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి దేవిని వేడుకోండి.వీలైన వారు కనకధారా స్తోత్రాన్ని, లలిత సహస్రనామాన్ని గాని చదవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube