మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక గుడికి వెళ్లి దేవునికి పూజలు చేస్తూనే ఉంటారు.దేవాలయానికి వెళ్లడమే కాకుండా కొంతమంది ప్రజలు ఇంట్లో కూడా పూజలు చేస్తుంటారు.
ఇలాగా ప్రతిరోజు ఆరోజుకి సంబంధించిన భగవంతుడికి పూజలు చేయడం వల్ల కలిగే పుణ్య ఫలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా ఆదివారం రోజు సూర్య భగవంతునికి ఎంతో ఇష్టమైన రోజు.
సూర్య భగవంతుడు భూమిపై ఉన్న సమస్త జీవరాసులకు ఆయుష్షు, ఆరోగ్య శ్రేయస్సును ఇస్తాడు.సోమవారం రోజు శివపార్వతులను పూజించడం ఆ ఇంటికి ఎంతో మంచిది.
ఇంకా చెప్పాలంటే భక్తులు శివుడి అనుగ్రహం పొందడానికి సోమవారం రోజు ఉపవాసం కూడా ఉంటారు.శివుడు తనను పూజించే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం.
మంగళవారం రోజు ఆంజనేయునికి పూజ చేయడం వల్ల జీవితంలోని ఆటంకాలు భయాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.బుధవారం రోజు వినాయకునికి ఎంతో భక్తితో భక్తులు పూజలు చేస్తూ ఉంటారు.
భక్తుల జీవితాలలో ఏవైనా ఆటంకాలు ఏర్పడిన తొలగిపోతాయని నమ్ముతారు.
గురువారం రోజు మహావిష్ణువు కు పూజ చేయడం వల్ల జీవితంలో దాంపత్య శాంతి, కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.విష్ణు విష్ణువు అనుగ్రహం మీపై ఉండాలంటే అరటి బోదులో దీపం వెలిగించడం మంచిది.శుక్రవారం రోజు మహాలక్ష్మి దుర్గాదేవి అన్నపూర్ణేశ్వరి దేవతలను పూజించాలని పురాణాలలో ఉంది.
ఈ దేవతలకు బెల్లం నెయ్యి పాల ఉత్పత్తులను నైవేద్యంగా సమర్పించాలి.
శనివారం రోజు శని దేవునికి పూజలు చేయడం వల్ల దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడని భక్తులు ప్రజలు నమ్ముతారు.
జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవారు ఎక్కువగా శనివారం రోజు పూజలు చేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల సంతోషం ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి అని చెబుతూ ఉంటారు.
పేదలకు అన్నదానం చేసి, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడం వల్ల శని దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చని బలంగా నమ్ముతారు.
LATEST NEWS - TELUGU