ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన లిరీష ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా వకీల్ సాబ్ సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.సీరియల్ ఎక్స్ ప్రెషన్ కు సినిమా ఎక్స్ ప్రెషన్ కు చాలా తేడా ఉండదని లిరీష అన్నారు.
సీరియళ్లలో చేసే నటీమణులకు త్వరగా పాపులారిటీ వస్తుందని లిరీష అన్నారు.ఇందులో కొంచెం అతి ఎక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీలో నార్మల్ గా ఎక్స్ ప్రెషన్ ఇచ్చినా సరిపోతుందని ఆమె అన్నారు.
పొలిటికల్ రౌడీ సినిమాతో నేను ఎంట్రీ ఇచ్చానని ఆ సినిమాలో ఛార్మి ఫ్రెండ్ గా చేశానని ఆమె తెలిపారు.
అలీ సార్ వల్ల పొలిటికల్ రౌడీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని ఆమె అన్నారు.నాకు సాధారణంగానే మోహన్ బాబు గారు అంటే భయం అని ఆమె కామెంట్లు చేశారు.
ఆ తర్వాత చిన్నచిన్న పాత్రలు ఎక్కువగా వచ్చాయని ఆమె పేర్కొన్నారు.ఒక సీన్ లో నేను కింద పడాలని అయితే ఎంత కష్టపడినా పడలేదని ఆమె తెలిపారు.
ఆ సీన్ లో సరిగ్గా చేయకపోవడంతో మోహన్ బాబు గారు వచ్చి వెనుక నుంచి ఒక్క తోపు తోసేశారని లిరీష పేర్కొన్నారు.ఆ తర్వాత కింద పడిపోయి పైకి చూశానని ఆమె అన్నారు.మోహన్ బాబు గారి మూవీ షూటింగ్ కు ఉదయం 5.30 గంటలకు వచ్చానని లిరీష అన్నారు.మోహన్ బాబు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ఆమె వెల్లడించారు.లిరీష వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లిరీష మరిన్ని సినిమా ఆఫర్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.వకీల్ సాబ్ మూవీ సక్సెస్ తర్వాత లిరీష రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది.లిరీష రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.