జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాతుకోవాలి అంటే పార్ట్ టైం పాలిటిక్స్ పనిచేయవని, పూర్తిగా ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకువెళ్లి హైలెట్ చేసి వాటిపైనే పోరాటాలు చేపట్టడం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చనే విషయాన్ని పవన్ ఆలస్యంగా గుర్తించారు.
అందుకే వరుస వరుసగా వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే కార్యక్రమాలకు, అలాగే జనసేన ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు అవసరమైన కసరత్తులు పవన్ చేస్తున్నారు.ఈ సందర్భంగా 2019 ఎన్నికలకు ముందు జగన్ ఉపయోగించిన నినాదాన్ని ఇప్పుడు పవన్ హైలెట్ చేస్తున్నారు.
‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి ‘ అంటూ జగన్ నినాదాన్ని పవన్ ఇప్పుడు హైలెట్ చేసే పనిలో పడ్డారు.విజయనగరం జిల్లాలోని గుంకలం గ్రామ సరిహద్దుల్లో ఉన్న జగనన్న ఇళ్ళ నిర్మాణ పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన పవన్ అక్కడ ప్రజలతో మాట్లాడుతూ, తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, అవినీతి రహిత పాలన అంటే ఏమిటో తాను చూపిస్తానని, జేబులో డబ్బు తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టే వాడిని తానని, అవినీతి చేయను అంటూ పవన్ ప్రసంగించారు.పవన్ ఈ కొత్త నినాదం జనసైనికులు , జనాలలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.2019 ఎన్నికలకు ముందు జగన్ ఇదే నినాదాన్ని పదేపదే ఉపయోగించేవారు.తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని అవినీతి రహిత పాలన అంటే ఏమిటో చూపించడంతో పాటు ఏపీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధివైపు తీసుకువెళ్తానంటూ చెబుతూ జగన్ పాదయాత్ర నిర్వహించారు.
గతంలో అనేకమార్లు టిడిపి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంటుందో చూసిన జనాలు జగన్ కు ఒక ఛాన్స్ ఇస్తే తప్పేముంది అన్న ఆలోచనకు రావడం తో జగన్ కు 151 సీట్ల ను జనాలు కట్టబెట్టారు.ఆ సీట్లతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.ఇప్పుడు అదే నినాదాన్ని పవన్ అందుకున్నారు.
ఈ స్లోగన్ వర్కౌట్ అవుతుందని, జనాల్లోనూ మార్పు వస్తుందని ఇప్పటి వరకు టిడిపి వైసిపిల పాలన చూసిన జనాలు తనకు ఒక అవకాశాన్ని తప్పకుండా ఇస్తారని పవన్ ఆశలు పెట్టుకోవడంతోనే ఇప్పుడు ఈ నినాదాన్ని హైలెట్ చేసే పనిలో పడ్డారు.