జాబాలి తీర్థం స్థల పురాణం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు, సాక్షాత్తు రుద్రతేజో రూపుడిగా జగద్రక్షణ కోసం అవతరించిన కారణ జన్ముడనే విషయం మన అందరికీ తెలిసిందే.అయితే జాబాలి మహర్షి కోరిక మేరకు అంజనీసుతుడు స్వయంభువుగా వెలసిన పవిత్ర క్షేత్రమే జాబాలి తీర్థం.

 Jabali Theertham Sthala Puranam In Telugu ,  Anjaneya Swamy Famous Temple, Impor-TeluguStop.com

ఈ పవిత్ర దివ్య క్షేత్రాలనికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రాశస్త్యంలో ఉంది.ముప్పై కోట్ల మంది దేవతల కోరిక మేరకు శ్రీ మహా విష్ణువు శ్రీ రాముని అవతారంలో అవతరించడానికి నిర్ణయం జరుగుతుంది.

అప్పుడు జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రదేశాల్లో జపం చేస్తూ ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయడం ప్రారంభిస్తారు.అప్రుడు రుద్రుడు రాబోవు అవతారాన్ని ఆయనకు ముందుగానే చూపిస్తారు.

అదే హనుమంతుడి అవతారం.

దేవతల అందరితో కలిసి వానర అగ్ర గణ్యుడిగా అవతరిస్తానని చెప్తాడు.

జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి అంటారు.అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరతాయి కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి తీర్థం అంటారు.

అయితే అయోధ్య కాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు.ఆ దోషాన్ని తొలగించుకునేందుకు జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానం ఆచరిస్తాడు.

ఇలా జాబాలి మహర్షి తన దోషాన్ని తొలగించుకుంటాడు.కాబట్టి మీరు కూడా జాబాలి తీర్థానికి వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకొని.

రామగుండంలో స్నానం చేస్తే అనేక రకాల పాపాలను తొలగించుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube