అట్లతద్ది పండుగ ఎప్పుడూ జరుపుకుంటారు.. పార్వతి దేవి ఆచరించిన వ్రతం గురించి తెలుసా ..?

ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 31వ తేదీన అట్లతద్ది తదియ మొదలవుతుందని పండితులు( Scholars ) చెబుతున్నారు.31వ తేదీన రాత్రి 9:30 నిమిషములకు తదియ మొదలై నవంబర్ 1వ తేదీన రాత్రి 9:19 నిమిషములకు ఈ శుభ సమయం ముగిసిపోతుందని చెబుతున్నారు.హిందూ పురాణాలలో అట్లతద్దికి ( Atla Tadde festival )ఎంతో విశిష్టత ఉంది.ఆశ్వయుజ బహుళ తదియ రోజు మహిళలు జరుపుకునే ఈ పండుగను అట్లా తద్ది, ఉయ్యాల పండుగ అని అంటారు.

 Atlataddi Festival Is Always Celebrated Do You Know About The Vrat Performed By-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే మహిళలు తమ భర్తల దీర్ఘాయువు,మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటూ అట్లతద్ది వ్రతాన్ని ఆచరిస్తారు.తద్వారా మహిళలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారని ప్రజలు నమ్ముతారు.

Telugu Ashvina Masam, Atlatadde, Devotional, Gauri Devi Puja, Goddess Parvati, L

అలాగే అట్లా తద్ది వ్రతాన్ని పాటించే సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది.ప్రతి ఏడాది ఆశ్వయుజ బహుళ తదియ తిథి రోజున అట్లతద్ది పండుగను జరుపుకుంటారు.ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు అందంగా పెట్టుకుంటారు.ఈ పండుగ రోజు తెల్లవారు జామున నిద్రలేచి గౌరీదేవి పూజ( Gauri Devi Puja ) చేయాలి.

చంద్రుడిని చూసిన తర్వాత తిరిగి గౌరీదేవి పూజ చేసి అమ్మవారికి 11 అట్లు నైవేద్యంగా సమర్పించాలి.ఆ తర్వాత ముత్తైదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా ఇవ్వాలి.

అట్లతద్ది నోము కథ చెప్పుకొని శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి.ఆ తర్వాత భోజనం చేయాలి.11 రకాల ఫలాలను తినడం, 11 సార్లు తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఉయ్యాల ఊగడం ఈ పండుగలో ఉన్న మరో ప్రాముఖ్యత అని పండితులు చెబుతున్నారు.

Telugu Ashvina Masam, Atlatadde, Devotional, Gauri Devi Puja, Goddess Parvati, L

గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు.కాబట్టి ఈ పండుగను అట్లతద్ది అని పిలుస్తారు.పది సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేస్తే మహిళలకు( women ) సంసారంలో సర్వసుఖాలు లభిస్తాయి.

సృష్టి స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుల భార్యలు సరస్వతి, లక్ష్మీ,పార్వతులకు నెల రోజులు పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం.అమ్మ వారికి ఆటపాటలు అంటే ఎంతో ఇష్టం.

కాబట్టి ఇంకా రజస్వల కాని ఆడపిల్లలు ఆడినా పాడిన వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్లు అని పురాణాలలో ఉంది.పురాణాల ప్రకారం అట్లతద్ది పండుగను మొదటిసారిగా పార్వతి దేవి ( Goddess Parvati )తన భర్త శంకరుడి కోసం చేసింది.

అప్పటి నుంచి ఈ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం కొనసాగుతుంది.మరొక కథ ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవుడు( Lord Brahma ) మహిళలందరినీ తమ భర్తల కోసం అట్లతద్ది వ్రతం పాటించమని కోరాడు.

ఆ తర్వాత ఈ సంప్రదాయం మొదలైందని పురాణాలలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube