ముంబై వెళ్తున్న మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో మళయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ రీమేక్ గా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమాని కోలీవుడ్ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.

 Megastar Chiranjeevi Godfather Shift To Mumbai , Chiranjeevi , Godfather, Godfat-TeluguStop.com

సినిమాలో చిరుతో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు.సినిమాలో చిరు, సల్మాన్ ఖాన్ ల సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు.

ఇప్పటివరకు 60 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ముంబైలో పెట్టుకుందని తెలుస్తుంది.ఈ నెల 28 నుంచి ముంబైలో గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ ఫిక్స్ చేశారట.

ముంబై షెడ్యూల్ లో కూడా చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా కొన్ని సీన్స్ చేస్తారని తెలుస్తుంది.సల్మాన్ కి అందుబాటులో ఉండటం కోసమే ముంబైలో షెడ్యూల్ పెట్టుకున్నారని తెలుస్తుంది.

గాడ్ ఫాదర్ సినిమాలో చిరు లుక్ అదిరిపోతుందని రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ తోనే తెలిసింది.తప్పకుండా ఈ సినిమా మెగా ఫ్యాన్స్ అందరికి సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.

ఈ సినిమాలో సత్యదేవ్ తో పాటుగా సునీల్ కూడా నటిస్తున్నారు.

Telugu Chiranjeevi, Godfather, Mohan Raja, Salman Khan, Tollywood-Movie

గాడ్ ఫాదర్ సినిమాని సెప్టెంబర్ 29న రిలీజ్ ఫిక్స్ చేశారు.ఇక ఈ సినిమాతో పాటుగా చిరంజీవి ఓ పక్క మెహర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమా చేస్తూనే.మరోపక్క కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో వాళ్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.వరుస క్రేజీ సినిమాతో మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు వస్తున్నారు మెగాస్టార్.

వాళ్తేర్ వీరయ్య సినిమాలో కూడా మాస్ మహరాజ్ రవితేజ కూడా ఒక పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది.గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.

ఆమెకు సంబందించిన పోర్షన్స్ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube