మానవ శరీరంలో మూత్రపిండాలు ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే.బీన్స్ ఆకారంలో ఉండే ఇవి శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మలినాలను బయటకు పంపిస్తాయి.
దీర్ఘ కాలికంగా మూత్ర పిండాలు జబ్బు బారిన పడితే సమస్యలు వస్తాయి.దీంతో కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి జబ్బులు మనిషి శరీరంలో కనిపిస్తాయి.
శుద్ధి చేసే మూత్రపిండాలు పాడైపోతే శరీరంలో మలినాలు చేరిపోయి చనిపోయే పరిస్థితి వస్తుంది.దానికోసం డబ్బున్నోళ్లు అయినా, లేనోల్లు అయిన లక్షలు ఖర్చు పెట్టి డయాలసిస్ చేయించుకోవాల్సిందే.
అయినా ఎన్ని రోజులు బతుకుతారో తెలియని పరిస్థితి.అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సాన్ ఫ్రాన్సిస్కో శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టారు.
దీని కోసం వారు ‘ ద కిడ్నీ ప్రాజెక్ట్ పేరుతో ‘ చేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజులో బయో ఆర్టిఫిషియల్ కిడ్నీని తయారు చేశారు.
దీన్నే కృత్రిమ కిడ్నీ లేదా హైబ్రిడ్ మూత్ర పిండం అంటారు.
ఈ కిడ్నీ శరీరంలో ఇమిడిపోయి, ఎలాంటి సమస్య లేకుండా, మందులు వాడకుండా బ్యాటరీల అవసరం లేకుండానే పని చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ హైబ్రిడ్ మూత్ర పిండం రక్తాన్ని శుద్ధి చేసి మలినాలను బయటకు పంపడమే కాకుండా రక్తపోటు, శరీరంలోని లవణాలను నియంత్రణలో ఉంచుతుంది.దీంతో ఇక పై కృత్రిమ మూత్రపిండంతో డయాలసిస్ కు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు
![Telugu Dialosos, Benifits, Care, Tips-Latest News - Telugu Telugu Dialosos, Benifits, Care, Tips-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2021/09/health-care-health-tips-health-benifits.jpg )
వైద్య రంగంలో టెక్నాలజీ వింతలు సృష్టిస్తుంది.అలాంటి టెక్నాలజీతో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని నిరూపించారు అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో శాస్త్రవేత్తలు.వైద్య రంగంలో కృత్రిమ కిడ్నీ ఆవోష్కరణ ఒక చెప్పుకోదగ్గ, మైలురాయిగా నిలుస్తుంది.దీంతో చాలామంది కిడ్నీ రోగులకు ఊరటనిస్తుంది.