ఆ పది రోజులు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన భాగ్యం..!

వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల( Tirumala ) శ్రీవారి దేవాలయంలో డిసెంబరు 23వ తేదీ నుండి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని, భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు టిడిపి ఏర్పాట్లు చేస్తుంది.అయితే పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనానికి విశిష్టత ఉంది.

 Those Ten Days In Tirumala, The Visit Of Vaikuntha Is A Blessing. Tirumala , Vai-TeluguStop.com

వైకుంఠంలో శ్రీమహా విష్ణువు ఇంకొక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థమని పురోహితులు చెబుతున్నారు.అంతే కాకుండా అక్కడ పగలు 11 గంటలు అయితే ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు అంటే ఇక్కడ 6 నెలలు దక్షిణాయనంగా పేర్కొంటారు.

Telugu Andhrapradesh, Bhakti, Devotional, Lord Vishnu, Tirumala, Vaikuntadwara-L

అలాగే వైకుంఠంలో తెల్లవారు జామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానమని చెబుతున్నారు.అయితే దీన్ని ధనుర్మాసంగా పిలుస్తాము.తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీమహావిష్ణువు(Lord Vishnu ) దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారని చెబుతున్నారు.ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతి రోజు జరిగే ప్రక్రియగా పండితులు చెబుతున్నారు.

అయితే ఈ నలభై నిమిషాలు భూలోకంలో పది రోజులకు సమానం కావడంతో వైష్ణవాలయాలలో ఈ పది రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీమహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నట్టే అని పండితులు చెబుతున్నారు.

Telugu Andhrapradesh, Bhakti, Devotional, Lord Vishnu, Tirumala, Vaikuntadwara-L

కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ పది రోజులలో ఏ రోజు చేసుకున్న కూడా అన్ని రోజులు సమానమే అని చెబుతున్నారు.ఇక భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా టిడిపి విజ్ఞప్తి చేసింది.గదులు పరిమితంగా ఉన్న కారణం గా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులు కు సూచించారు.

గతంలో లాగా ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని టిడిపి అధికారులు తెలిపారు.ఈ సమయంలో సిఫారసు లేఖలు స్వీకరించమని కూడా వారు స్పష్టం చేశారు.

ఇక వైకుంఠ ద్వార దర్శన ఫలితం పది రోజుల పాటు ఉంటుందని పండితులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube