నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 683.675 అడుగులుగా ఉంది.
కాగా ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ 675 అడుగులని అధికారులు చెబుతున్నారు.
ప్రాజెక్టు నీటిమట్టం తగ్గుతుండటంతో రెండవ పంటకు సాగునీరు ఇవ్వలేమని అధికారులు ప్రకటించారు.ఈ క్రమంలోనే యాసంగిలో రైతులు సహకరించాలని ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి చేశారు.