వ్యాపారంలో నష్టం శత్రు భయం ఉన్నవారు ఈ దేవీని దర్శించుకుంటే చాలు..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యంగిరా దేవిని పూజించడం ద్వారా ఏర్పడే శుభాలు ఎన్నో ఉన్నాయి.ఆ శుభల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం హిరణ్యకశిపుడిని చంపేందుకు విష్ణువు నరసింహస్వామిగా అవతరించిన సంగతి దాదాపు చాలా మందికి తెలుసు.హిరణ్యకశిపుడిని తన గోళ్ల తో చీల్చి చెండాడిన తర్వాత స్వామి కోపం చల్లారింది అని పండితులు చెబుతున్నారు.

దాంతో శివుడు శరభేశ్వరుడు( Lord shiva ) అనే అవతారంలో నరసింహ స్వామి( Sri Lakshmi Narasimha Swamy )ని ఓడిస్తాడు.అలా ఆయన కోపాన్ని చల్లార్చుతాడు.

ఆ సమయంలో అమ్మవారు శూలిని,మహా ప్రత్యంగిరా అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది.

Telugu Devotional, Lord Shiva, Lord Vishnu, Srilakshmi-Latest News - Telugu

ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిరా, అంగీరసుడు అనే ఇద్దరు ఋషులు దర్శించారు.అందుకనే ఆ ఇద్దరి పేర్లతో ఈమెను ప్రత్యాంగిరా అని పిలుస్తూ ఉంటారు.శత్రువులను మట్టు పెట్టి ఎదురు తిరిగే దేవత అని అర్థం.

దుష్టశక్తులు పీడుస్తున్నాయని భయపడుతున్న వారు, చేతబడి జరిగిందని అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైన పని చేయకుండా ఉంటుందని స్థానిక పూజారులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యాంగిర దేవికి ( Pratyangira devi )మరో ప్రత్యేకత కూడా ఉంది అదే నికుంబల హోమం.

Telugu Devotional, Lord Shiva, Lord Vishnu, Srilakshmi-Latest News - Telugu

హోమాన్ని చేసినవాళ్లు ఎలాంటి విజయమైన అందుకుంటారని పూజారులు చెబుతున్నారు.ప్రత్యంగిర దేవాలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమాన్ని జరిపిస్తారు.అమ్మవారి సప్తమాతృకలలో ప్రత్యంగిరా దేవి కూడా ఒకరు.ఇంకా చెప్పాలంటే అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతిగా భావిస్తారు.అలాగే ప్రత్యంగిరా దేవి సింహముఖంతో ఉంటుంది.కాబట్టి ఆమెకు నారసింహి అని కూడా పేరు వస్తుంది.

ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టం, శత్రు భయం ఉన్నవారు ఈమెను ఆరాధిస్తే ఈ బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.శని, ఆదివారాల్లో ఈమెను పూజించడం వల్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube