చరిత్ర తన కాల గర్భంలో ఎన్నో మంచి విషయాలతో పాటు దుర్ఘటనలను కూడా దాచుకుంటుంది.అలాంటి ఒక దుర్ఘటన వైస్రాయ్ సంఘటన.
( Viceroy Incident ) ఎన్టీఆర్ ( Sr NTR ) లాంటి మహానుభావుడికి తెలిసో తెలియకనో చెప్పులతో సన్మానం జరిగిన రోజు.ఆ రోజు తప్పు ఎవరిదీ, ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు అనే విషయం లోకి వెళ్లదలుచులోలేదు.
ఏది ఏమైనా ఒక జరగరాని సంఘటన జరిగిపోయింది.ఆ రోజు ఆ మహానుభావుడు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు, ఎంతలా కృంగిపోయి ఉంటారు, మనసు చంపుకొని ఎంత వేదనకు గురయి ఉంటారు అనే మానసిక ఆందోళన చాలా మందిలో ఉండిపోయింది.

ఇదే విషయం అయన కూతురు పురందరేశ్వరి( Purandeshwari ) కూడా ఆలోచిస్తూ తండ్రిని కలవాలని మొండి పట్టు పట్టింది.సాధారణంగానే ఎన్టీఆర్ ఆగ్రహం అనే గ్రహాన్ని మోస్తూ ఉంటారు.ఆ సమయంలో తనకు వెన్నుపోటు పొడిచిన తన పార్టీ తో పాటు కుటుంబం కూడా చేరింది.అందుకే పురందరేశ్వరి తో పాటు కుటుంబం అంతా అయన ఎలా ఉన్నారో అనే ఆవేదన చెందిన ఆయన్ను కలిసే దైర్యం చేయలేకపోయారు.
ఒక్క పురందరేశ్వరి మాత్రం నాన్న గారిని చూడాలి, కలవాలి, అయన తిట్టిన చివరికి కొట్టిన పర్వాలేదు అని అయన ఉంటున్న ఇంటికి వెళ్లాలని అనుకున్న సమయంలో బాలకృష్ణ వద్దని వారించారు.అక్కడ అయన ఆగ్రహం తో ఊగిపోతూ ఉంటారు, ఈ సమయంలో నువ్వు కనిపించిన మనలో ఎవరు కనిపించిన ఆ కోపాన్ని తట్టుకోలేరు, ఆ అవమానం తో నువ్వు వెనక్కి వచ్చి ఏడిస్తే నేను చూడలేను చిన్నమ్మ(పురంధరేశ్వరిని అందరు ఇలాగే పిలిచేవారు) అన్నారు.

అయినా కూడా ఆమె వినకపోవడం తో బాలకృష్ణ( Balakrishna ) కూడా ఆమెకు తోడుగా వెళ్లారు.బయట ఇంటి ముందు బాలకృష్ణ కుర్చీలో కూర్చోగా, తండ్రి కూర్చున్న ఆఫీస్ రూమ్ లోకి పురందరేశ్వరి వెళ్ళింది.ఆమె వెళ్ళగానే ఒక్క మాట కూడా అనలేదు, కోపం కూడా చూపించలేదు, రండి.కూర్చోండమ్మా అని ఒక ముసలివాడిని గద్దె దించడానికి కుటుంబం మొత్తం ఏకమయ్యారు కదా.అని మాత్రమే అన్నారట.అది ఎన్టీఆర్ గొప్పతనం అంటే.
అంతటి అవమానాన్ని కూడా ఆ రోజు కూతురు ముందు దిగమింగుకున్నారు.ఆ రోజు అయన ప్రవర్తన గురించి పురందరేశ్వరి ఇప్పటికి గుర్తు చేసుకుంటారు.
నాన్న ఒక్క మాట అన్న, కొట్టిన కూడా పర్వాలేదు.కానీ ఆ మాట నా జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంది అని అన్నారు.