సాధారణంగా ఇంటి ఆవరణంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఎన్నో రకాల పూల మొక్కలను పెంచుతూ ఉంటారు.ఈ విధంగా రకరకాల పూల మొక్కలను పెంచడం వల్ల మన ఇంటి వాతావరణం ఎంతో బాగుంటుంది.
అయితే ఇంటి ఆవరణంలో మొక్కలను పెంచే విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని చాలామంది పరిగణలోకి తీసుకుంటారు.ఈ విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంటి ఆవరణంలో పెట్టకూడదని భావిస్తారు.
అదే విధంగా మరి కొన్ని మొక్కలను సరైన దిశలో పెట్టడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని భావిస్తారు.
ఈ క్రమంలోనే మన ఇంటి ఆవరణంలో ఈశాన్య దిశలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పూల మొక్కలలో నందివర్ధనం, సన్నజాజి, మల్లెపువ్వు, వంటి మొక్కలను పెంచాలి.
ఈ మొక్కలకు పూసిన పుష్పాలతో అమ్మవారికి పూజలు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై కలగడమే కాకుండా సిరి సంపదలు వృద్ధి చెందేలా చేస్తుంది.అదే విధంగా ప్రతి రోజూ మనం ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశ వైపు పచ్చని మొక్కలు చూడటం ఎంతో మంచిది.
ఈ విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణంలో ఇలాంటి పూల మొక్కలు ఉండటం వల్ల ఆ ఇంటిలో సిరిసంపదలకు ఏమాత్రం లోటు ఉండదు.అయితే ఇంటి ఆవరణంలో ఎల్లప్పుడూ కూడా పాలుకారే చెట్లు, ముళ్ళు కలిగిన చెట్లు ఉండకూడదు.ఇలాంటి చెట్లు ఉండటం వల్ల ఆ ఇంటి పై ప్రతికూల ప్రభావం ఏర్పడటమే కాకుండా సిరిసంపదలకు లోటు ఉంటుంది.కనుక ఇంట్లో వాస్తు ప్రకారం ఆ పూల మొక్కలు నాటడమే కాకుండా దైవ సమానంగా భావించే రామ తులసి, కృష్ణ తులసి వంటి వృక్షాలను పూజించడం ఎంతో మంచిదని చెప్పవచ్చు.