తిథిని బట్టి ఏ దేవుడిని ఆరాధించాలో తెలుసా?

పూర్వం మన పెద్దలు తేదీలను కాకుండా, తిథిని బట్టి లెక్కించేవారు.అది ఏదైనా పండుగలు కానీ, పెళ్లిళ్లు కానీ, పుట్టినరోజులు కానీ జరుపుకునేటప్పుడు తిథిని బట్టి వేడుకలను జరుపుకుంటారు.

 Tithi, Nakshatra, God, Praise, Hindu Rituals, Ganesh, Vishnuvu, Siva-TeluguStop.com

అంతేకాకుండా కొంత మంది వారి జన్మ తిధిని బట్టి దేవతలను ఆరాధిస్తుంటారు.అయితే ఏ తిథిని బట్టి ఏ దేవతలను ఆరాధించాలి తెలుసా? 16 తిథిలలో ఒక్కో తిథికి ఒక్కొక్క దేవుని ఆరాధిస్తూ ఉంటారు.ఏ తిథికి ఏ దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

16 తిథులు:

ప్రతిమ, ద్వితీయ, తృతీయ, చతుర్దశి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్య తిథి చంద్రుని మొదటి దశలో భాగంగా పరిగణించబడుతుంది.అమావాస్య రోజు నుంచి పౌర్ణమి వరకు ప్రారంభమయ్యే 15 రోజులను శుక్ల పక్షం అని, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ప్రారంభమయ్యే మిగతా 15 రోజులను కృష్ణపక్షం అని పిలుస్తారు.

ప్రతిపదం తిథిన అగ్ని దేవుణ్ణి పూజించడం వల్ల అపరిమితమైన సంపదను కలుగజేస్తుంది.

ద్వితీయ తిథిన బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల అన్ని రకాల విద్యలలో ఆరితేరుతారు.

తృతీయ రోజున కుబేరుని పూజించడం వల్ల సిరిసంపదలు కలుగుతాయి.

కుబేరుడు సంపదకు మూలకారకుడు.

చతుర్దశి రోజున వినాయకుడిని పూజించడం ద్వారా మనం తలపెట్టిన ఏ కార్యమైనా ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది.

పంచమి

రోజున నాగదేవతలకు ఆరాధించడం వల్ల నాగ సర్ప దోషాలు తొలగిపోతాయి.

షష్టి

రోజున కార్తికేయుని పూజించడం వల్ల కీర్తి ప్రతిష్టలను పొందుతారు.

సప్తమి

రోజున ఆ సూర్యభగవానుని ఆరాధించాలి.

అష్టమి

రోజున ఆ పరమేశ్వరుని ఆరాధించడం వల్ల జ్ఞానాన్ని పొందవచ్చు.

నవమి

రోజున దుర్గామాతను ఆరాధించడం వల్ల చెడు ను నశింపజేసి విజయాన్ని కలుగజేస్తుంది

దశమి

ఈ రోజున ఆ యమధర్మరాజును ఆరాధించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడమే కాకుండా, మరణ బాధలు తొలగిపోతాయి.

ఏకాదశి

రోజున విశ్వ దేవున్ని ఆరాధించాలి.

ద్వాదశి

రోజున విష్ణు భగవానుడిని పూజించడం వల్ల అన్ని విషయాలలో విజేతగా రాణిస్తారు.

త్రయోదశి

రోజున కామదేవుని ఆరాధించడం వల్ల అందమైన జీవిత భాగస్వామి దొరుకుతుంది.

చతుర్దశి

రోజు సదాశివుని వారి కుమారులను పూజించాలి.

పౌర్ణమి

రోజున చంద్రుని ఆరాధిస్తారు, అమావాస్య రోజున చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని పూజిస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube