అవును, మీరు విన్నది నిజమే.ఆ గుడికి వెళ్లి అక్కడి గుడి ప్రాంగణంలో అరటి గెల ఆ విధంగా వేలాడదీసినట్లైతే మీ కోరికలు నెరువేరుతాయి.
సాధారణంగా ఏదైనా ఆలయానికి భక్తులు వెళ్లినప్పుడు పత్రం, ఫలం, పుష్పం ఏదో ఒకటి తీసుకెళ్తుంటారు.కొన్ని గుళ్ళల్లో తాము కోరిన కోర్కెలు తీరితే కోళ్లు, మేకలు బలిస్తుంటారు.
చాలా ఆలయాల్లో ఇదే సంప్రదాయం ఉంటుంది.కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆలయంలో వింత సంప్రదాయం ఉంది.
అనుకున్నది జరిగితే అయ్యగారికి అరటి గెల సమర్పిస్తారు.అందుకే అయ్యగారి ఆలయంలో ఎక్కడ చూసినా అరటి గెలలే వేలాడుతూ మనకు కనిపిస్తాయి.
ఇంతకీ ఆ గుడి ఏ గుడి అనే డౌట్ మీకు వస్తుంది కదూ.అదే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం.ఈ ఆలయంలో కట్టే ముడుపులు వేరుగా ఉంటాయి.అక్కడ కోరిన కోరికలు నెరవేరిన తరువాత భక్తులు స్వామి వారి సన్నిధిలో ఆనందంతో అరటి గెలలు కడుతూ వుంటారు.
ఈ ఆలయంలో దాదాపుగా గత 80 ఏళ్ల నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.ఈ గుడి ఎక్కడ కొలువై ఉందంటే.శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం, చెట్లతాండ్ర గ్రామంలో లక్ష్మీనృసింహ స్వామి వారు కొలువయ్యారు.ఉద్యోగం కావాలన్నా.
పెళ్లి జరగాలన్న.పిల్లలు కలగాలన్న ఇలా భక్తులు కోరిన కోర్కేలు తీరాలంటే ఒక్క అరటి గెలచాలు.
కోర్కెలు ఇట్టే తీరిపోతాయని అక్కడి భక్తులు ప్రగాఢ విశ్వాసం.

అందుకే అక్కడ ఆలయ ప్రాంగణమంతా అరటి గెలలతో నిండిపోతుంది.ఇక్కడ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మొదటగా ఈ అరటి గెలలే స్వాగతం పలుకుతాయి.లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న రావి చెట్టు పక్కన వేసిన పందిర్లకు అరటి గెలలు కడితే కోరిన కొర్కేలు తీరుతాయని భక్తుల నమ్ముతారు.
అందుకే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడి స్వామికి అరటి గెలలు కడుతుంటారు.ఈ కారణం వల్లనే చెట్లతాండ్ర అనే ఓ కుగ్రామం ఫేమస్ అయిపోయింది.
DEVOTIONAL