రీసెంట్ టైమ్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్ద హీరోల సినిమాల నుంచి స్టార్ హీరోయిన్లు వరుసగా తప్పుకుంటున్నారు.క్రియేటివ్ డిఫరెన్సెస్( Creative Differences ) అనే పదం వాడేసి వారు బయటకు వచ్చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం చిరంజీవి( Chiranjeevi ) సినిమా నుంచి త్రిష( Trisha ) బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో ఈ ముద్దుగుమ్మ క్రియేటివ్ డిఫరెన్సెస్ అనే పదం వాడేసింది.
గుంటూరు కారం సినిమాలోనూ ఇదే జరిగింది.పూజా హెగ్డేని( Pooja Hegde ) సినిమా టీమే తీసేసిందని వార్తలు వచ్చాయి కానీ ఆమెనే దీని నుంచి తప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్లు క్రియేటివ్ డిఫరెన్సెస్ చెప్పే వాటిలో నటించడం మానేస్తుండటం చూస్తూనే ఉన్నాం.
నిజానికి పెద్ద హీరోల సినిమాలను నేరుగా కాదంటే చాలానే పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది.
దానికి తోడు ట్రోలింగ్, విమర్శల వంటివన్నీ భరించాల్సి ఉంటుంది.అందుకే హీరోయిన్లు క్రియేటివ్ డిఫరెన్సెస్ అనే సరిగా అర్థం కాని పదాన్ని వాడేస్తున్నారు.
లేదంటే ఇండస్ట్రీలో వారి రిలేషన్స్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది.అవకాశాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
అందుకే పెద్ద హీరోల మనసు నొచ్చుకోకుండా, ఫ్యాన్స్‌లో ఎలాంటి నెగెటివిటీ రాకుండా ఈ ముద్దుగుమ్మలు జాగ్రత్త పడుతున్నారు.

సాయి పల్లవి( Sai Pallavi ) ఒక్కటే డైరెక్ట్‌గా చిరంజీవి సినిమాలో చేయనని చెప్పేసింది.అయినా ఆమెపై ఎలాంటి విమర్శలు రాలేదు.అలాగే ఇండస్ట్రీలో ఆమె మర్యాద కోల్పోలేదు.
హీరోయిన్లు ఒక్కరనే కాదు మ్యూజిక్ కంపోజర్ల వంటి కీలక టెక్నీషియన్లు కూడా ఇదే వర్డ్ ఉపయోగిస్తూ సినిమాలను వదిలేస్తున్నారు.ఉదాహరణకు, గుంటూరు కారం మూవీకి పనిచేస్తున్న తమన్ అన్‌హ్యాపీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అతను మాత్రమే కాదు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న వినోద్ కూడా తాజాగా ఎగ్జిట్ అయ్యాడు.దీనంతటికీ కారణం త్రివిక్రమ్ కఠిన రూల్సే కారణమని తెలుస్తోంది.ఇక మిగతా పెద్ద హీరోల సినిమాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ను హీరోయిన్లు ఫేస్ చేస్తున్నారనేది తెలియడం లేదు.ఏది ఏమైనా పెద్ద హీరోల సినిమాల నుంచి ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం ప్రేక్షకుల్లో ఆందోళనకు కారణమవుతోంది.