మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి రావడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే ప్రస్తుతం నాలుగవ నెల అయిన ఆషాడమాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది.
ఈ క్రమంలోనే శ్రావణమాసం మరి కొద్ది రోజులలో ప్రారంభంకానుంది.తెలుగు మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ నెలలో ఎంతో పరమ పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు.ఈ శ్రావణ మాసంలో మహిళలు ఎన్నో రకాల పూజలు నోములతో బిజీగా ఉంటారు.
మరి ఇంత పవిత్రమైన శ్రావణమాస అమావాస్య ఎప్పుడు వస్తుంది? ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
ఈ ఏడాది శ్రావణ మాస అమావాస్య 2021 ఆగస్టు 8వ తేదీ ఆదివారం వస్తుంది.అమావాస్య 7వ తేదీ అంటే శనివారం రాత్రి7:13 నిమిషాలకు ప్రారంభం కాగా ఆదివారం రాత్రి 7:21 గంటల వరకు అమావాస్య తిథి ఉంటుంది.మనదేశంలో ఈ శ్రావణ మాసం అమావాస్య ను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విదంగా పిలుస్తారు.మరి మన తెలుగు రాష్ట్రాలలో ఈ అమావాస్యను పోలా అమావాస్య అని పిలుస్తారు.
అమావాస్య సందర్భంగా గోదావరి నది పొంగి పొర్లుతుందని అర్థం.పోలా అమావాస్య అనగా పోలా అంటే.
కడుపునిండా తిండి తిని నీరు తాగే ఎద్దు అని అర్థం.పోలామా అనగా ఎద్దులకు బాగా తిండి పెట్టే సమయం అని అర్థం.
అందుకే ఈ అమావాస్య రోజు ఎక్కువగా గోవులకు పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.

ఈ అమావాస్య రోజు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పోలాంబ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.ఈ విధంగా సంతానం లేనివారు అమ్మవారికి పూజలు చేయటం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని భావిస్తారు.అదేవిధంగా గోదావరి నదికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.
అదేవిధంగా ఈ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు.అమావాస్య నుంచి శ్రావణమాసం మొదలవడంతో నెల మొత్తం వివిధ రకాల పూజలు వ్రతాలు చేస్తూ ఆ దేవతల అనుగ్రహం పొందుతారు
.