ఇలా చేస్తే తులసి మొక్కను తిరిగి జీవించేలా చేయవచ్చా..!

మన భారతదేశంలో( India ) చాలా మంది ప్రజలు తమ ఇళ్ళలో తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు.అయితే కొన్ని సందర్భాలలో తులసి మొక్క కొందరి ఇళ్లలో చనిపోతూ ఉంటుంది.

 If This Is Done, Can The Tulsi Plant Be Brought Back To Life , India, Basil Pla-TeluguStop.com

అందువల్ల దానిని తీసి పారేసి కొత్తది నాటుతూ ఉంటారు.మరి కొందరు ఇలా తులసి మొక్క( Basil plant ) చనిపోతే ఏదో కీడు జరిగిందేమో అని బాధపడుతూ ఉంటారు.

అయితే చనిపోయిన తులసి మొక్కను తిరిగి జీవించేలా చేయవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే తులసి మొక్కకు ఉండే కొమ్మలు ఇంకా పచ్చగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.ఇంకా చెప్పాలంటే ఒక వేళ ఎండిపోయిన గింజలు ఉంటే వెంటనే వాటిని తీసి వేరే కుండి లో వేస్తే మరో మొక్క కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది.

Telugu Basil, India, Red Clay, Vastu, Vastu Tips-Telugu Bhakthi

అలాగే రెండు రోజులకు ఒక సారి తులసి మొక్కకు నీళ్లు పోస్తూ ఉండాలి.తులసి మొక్క ఆకులు కిందకి వేలాడుతూ ఉంటే నీరు లేక అల్లాడిపోతుందని అర్థం చేసుకోవచ్చు.వెంటనే ఒక రెండు, మూడు మగ్గులతో నీళ్లు పోస్తే ఒక గంటలో ఆకులు చక్కగా విచ్చుకుంటాయి.అలాగే ఒక వేళ మొక్క చనిపోయేలా మీకు అనిపిస్తే వెంటనే ఆ మట్టిని తీసేసి కొత్త ఎర్ర మట్టిని ( red clay )వేసి కాస్త నీళ్లు పోయాలి.

తులసి మొక్కకు రోజుకు 6 నుంచి 8 గంటల పాటు సూర్య కిరణాలు తగిలేలా చూసుకోవాలి.అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.

Telugu Basil, India, Red Clay, Vastu, Vastu Tips-Telugu Bhakthi

ఇంకా చెప్పాలంటే కొంత మంది మహిళలు తులసి మొక్కను పూజించేటప్పుడు దీపం పెట్టి అగరబత్తిని వెలిగించి కుండీలోని మట్టిలోనే గుచ్చుతూ ఉంటారు.ఆ పొగ మొక్కకు తగిలి మొక్క కుమిలిపోతూ ఉంటుంది.అందుకోసం అగరవత్తిని కాస్త దూరంగా పెడితే మంచిది.అలాగే తులసి మొక్క ఆకులు పసుపు రంగులో ఉంటే వెంటనే ఆకులను మాత్రమే తుంచేయాలి.ముఖ్యంగా చెప్పాలంటే మొక్కను జాగ్రత్తగా ఓపికతో చూసుకుంటే తులసి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube