ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.07
సూర్యాస్తమయం: సాయంత్రం.6.16
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12
మేషం:
ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.ఈరోజంతా సంతోషంగా గడుపుతారు.
వృషభం:
ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.తీరిక లేని సమయం తో గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్థులు పెట్టుబడి విషయము పట్ల తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాల వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు.
సింహం:
ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
బంధువుల నుండి కొన్ని ఇబ్బందులెదురవుతాయి.వాటివల్ల నిరాశ చెందాల్సిన పని లేదు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి
కన్య:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యంపట్ల విశ్రాంతి దొరుకుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
తుల:
ఈరోజు మీరు ధన లాభాన్ని పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తిరిగి కాలేదు సమంత గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో గడపడానికి కాస్త సమయాన్ని తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:
ఈరోజు మీకు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల నుండి ఆహ్వానం అందుతుంది.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి.చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి వ్యాపారస్తులకు ఈరోజంతా పనులు జరుగుతూనే ఉంటాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ధనుస్సు:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలను ఇతరుల నుండి పొందుతారు.మీ సొమ్ము మీకు తిరిగి వస్తుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.
మకరం:
ఈరోజు మీకు ధన లాభం ఎక్కువగా ఉంటుంది.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
కొన్ని పనులు మొదలు పెట్టేముందు జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీకు కొన్ని పనుల విషయంలో అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
బంధు మిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.
మీనం:
ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.తీరిక లేని సమయం గడుపుతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది
.LATEST NEWS - TELUGU