చదువుల తల్లి సరస్వతి దేవి కొలువై ఉన్న బాసర పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు భక్తులు వచ్చి సరస్వతి దేవి దర్శనం చేసుకుంటూ ఉంటారు.అంతే కాకుండా చదువుల తల్లి బాసర సరస్వతి దేవి ఆలయానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి వారి చిన్నారులచే తొలి అక్షరం దిద్దించి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు.
అలా అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగే చదువుల తల్లి సరస్వతి అమ్మ వారి కొలువు దీరిన బాసరలో భక్తులకు ఈ కొత్త సంవత్సరం నుంచి అర్జిత సేవల భారం పడనుంది.

భక్తుల చిన్నారుల కు తొలి అక్షరం దిద్దించే కార్యక్రమానికి వేదికైనా బాసరలో సేవా టికెట్ల ద్వారా పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు దేవాలయ శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఆరు రకాల ఆర్జిత సేవ టికెట్లు ధరలను పెంచుతున్నట్లు దేవాలయ శాఖ అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం ఉన్న సేవా టికెట్ల ధర 30 నుంచి 50% మేరకు పెంచే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే 2023 జనవరి 1వ తేదీ నుంచి కొత్త ఆర్జిత సేవ ధరల ను బాసర దేవాలయా అధికారులు భక్తుల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం.అమ్మవారి రుద్రాభిషేకం టికెట్ ధర ఐదు వందలు, అక్షరాభ్యాసము 150, ప్రత్యేక కుంకుమార్చన 200, సత్యనారాయణ పూజా 400, నిత్యా చండీ హోమం 1500, అన్న ప్రసన్న 150 చొప్పున ధరలను పెంచారు.అయితే ఈ టికెట్ ధరల పై భక్తుల కు ఉచితం గా ప్రసాదం అందిస్తారని దేవాలయ అధికారులు వెల్లడించారు
.