తిరుమలలో భద్రతా వైఫల్యం బయటపడినట్లు తెలుస్తోంది.శ్రీవారి ఆలయ మాడ వీధుల్లోకి ఓ కారు దూసుకొచ్చింది.
కారుపై సీఎంవో స్టిక్కర్ ఉండగా.లోపలికి వచ్చినా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని తెలుస్తోంది.
మరోవైపు పార్కింగ్ లో స్థలం లేకనే తీసుకొచ్చానని కారు డ్రైవర్ చెబుతున్నాడు.భద్రతా సిబ్బంది లేకపోవడంతోనే ఘటన జరిగిందని సమాచారం.
అయితే టీటీడీ నిబంధనల ప్రకారం మాఢ వీధులలోకి వాహనాలకు ప్రవేశం లేదు.వైభవోత్సవ మండపం ముందు భాగంలో ఉన్న ప్రాంతంలోనే వాహనాలను నిలుపుదల చేయాలి.
మాడవీధుల్లోకి కారు ప్రవేశించడంపై భక్తులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.దీంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.







