నేలమట్టం కానున్న 250 కోట్లు..!?

2024 వరల్డ్ కప్( 2024 World Cup ) ఇప్పటికే దాదాపు సగం టోర్నీ ముగిసిందని చెప్పవచ్చు.భారత జట్టు మ్యాచ్‌ లలో దూకుడుగా ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే.

 Demolish The Nassau County International Cricket Stadium , 2024 T20 World Cup 20-TeluguStop.com

ఇక ఈ టోర్నమెంట్ అంతటా అందరూ ఒకే విషయం గురించి మాట్లాడుకున్నారు.అదేంటంటే.

న్యూయార్క్‌ లోని నాసావు కౌంటీ క్రికెట్ స్టేడియం గురించి.ఇప్పటివరకు ఈ న్యూయార్క్ స్టేడియం( New York Stadium ) గేమ్‌ లలో అత్యల్ప స్కోర్స్ ను మాత్రమే చూసింది.

అందరూ ఈ గ్రౌండ్ గురించే మాట్లాడుకున్నారు.ఇకపోతే తాజాగా ఈ స్టేడియాన్ని కూల్చేస్తామని అంటున్నారు.2024 ఐసీసీ టి20 ప్రపంచ కప్ లో ఎక్కువగా చర్చించబడిన విషయం ఏదైనా ఉందంటే, అది నసావు కౌంటీ స్టేడియం.ఎందుకంటే క్రికెట్ దిగ్గజాలు, హేమాహేమీలు కూడా ఈ పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.

ఈ పిచ్ నిజానికి హిట్టింగ్‌కు దోహదపడుతుందా.? బౌలింగ్ సహాయం చేస్తుందా.? ఎలాంటి మార్పులు ఎప్పుడు జరుగుతాయో నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.దీనికి కారణం ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు కూడా ఈ స్టేడియంలో కనీసం 150 స్కోర్ సాధించలేకపోతున్నాయి.

Telugu Cup, Cricket Stadium, India, York Stadium, Pakistan, Teamindia-Latest New

న్యూయార్క్‌లోని నసావు కౌంటీలోని ఈ స్టేడియం అమెరికా( America )లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ నుంచి వార్తల్లో నిలుస్తోంది.ఎందుకంటే కేవలం 3 నెలల్లోనే స్టేడియం నిర్మించారు.నిర్మాణం గురించిన అన్ని వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అంతేకాదు ఈ స్టేడియం నిర్మాణానికి రూ.250 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.ఈ స్టేడియం క్రికెట్ టౌన్‌ లో ప్రతి అంశం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఆటలు ప్రారంభమైన తర్వాత మరిన్ని ప్రతికూల వార్తలు వచ్చాయి.ఇప్పుడు తాజాగా ఈ స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

Telugu Cup, Cricket Stadium, India, York Stadium, Pakistan, Teamindia-Latest New

ఇకపోతే బుధవారం నాడు ఈ స్టేడియంలో భారత్, అమెరికా ఫైనల్ మ్యాచే చివరిదని ఇప్పుడు చాలా వార్తలు వచ్చాయి.అయితే రూ.250 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.ఈ వేదికపై వచ్చిన నెగిటివిటీనే దానికి కారణమని తెలుస్తోంది.

ఇకపోతే పిచ్ లను కూడా కొన్ని మార్గాల్లో మార్చవచ్చు.కానీ.

, అవుట్ ఫీల్డ్ కూడా అంటే కష్టం.స్టేడియం మొత్తం మార్చడం కష్టం కాబట్టి.

కూల్చివేయాలని నిర్ణయించారు.ఇదిలా ఉంటే, ఈ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్ ద్వారా 100 కోట్ల రూపాయల ఆద్యం వచ్చినట్లు సమాచారం.

కాబట్టి ఇక్కడ పెద్దగా అమెరికా డబ్బు కోల్పోయే అవకాశం సున్నా అని కొందరు వాదిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube