కునుకు తీసాడని జాబ్‌లో నుంచి తీసేశారు.. ఉద్యోగి కోర్టుకెక్కడంతో యజమానికి షాక్..!

కంపెనీలు ఉద్యోగులను( Companies employees ) మరమనుషులు లాగానే చూస్తాయి కానీ వారికీ ఎమోషన్స్ ఉన్నాయని, వారి పట్ల కనికరంగా నడుచుకోవాలని ఎప్పటికీ అర్థం చేసుకోవు.ఎప్పుడూ వారిని బానిసల్లాగానే చూస్తాయి.

 The Employer Was Shocked When The Employee Went To Court And Was Fired From The-TeluguStop.com

కంపెనీ కోసం జీవితాన్నే అంకితం చేసినా దాన్ని గుర్తించకుండా ఉద్యోగులు చేసే చిన్న చిన్న తప్పులను వెలెత్తి చూపించి, వారిని శిక్షించే యజమానులు ఈ ప్రపంచంలో కోకొల్లలు.అయితే ఇలాంటి యజమానులకు న్యాయస్థానాలు బుద్ధి చెబుతుంటాయి.

తాజాగా చైనా కంపెనీ యజమానికి అలాంటి బుద్ధినే నేర్పించింది కోర్టు.

వివరాల్లోకి వెళితే, చైనా దేశం, జియాంగ్సు ప్రావిన్స్‌, తైక్సింగ్‌లోని( Taixing, Jiangsu Province, China ) ఒక కెమికల్ కంపెనీలో జాంగ్ 20 సంవత్సరాలకు పైగా డిపార్ట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేశాడు.

ఈ ఏడాది ప్రారంభంలో, ఆయన తన డెస్క్‌పై నిద్రిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.అవి చూసి ‘నువ్వు పని చేయకుండా హాయిగా నిద్రపోతున్నావు.ఇది నీ ఇల్లు కాదు’ అంటూ కంపెనీ యజమాని ఫైర్ అయ్యారు.అంతేకాదు ఈ ఉద్యోగిని జాబ్ నుంచి పీకేశారు.

ఒక ముఖ్యమైన పనిని రాత్రి 12 గంటలకు పూర్తి చేసి, తరువాతి రోజు ఆయన పని చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

Telugu Chinese, Employee, Job Dismissal, Labor Laws, Zhang, Employershocked, Wor

రెండు వారాల తర్వాత, కంపెనీ హెచ్‌ఆర్ విభాగం ఒక నివేదిక విడుదల చేసింది.ఆ నివేదిక ప్రకారం, జాంగ్ “అతిగా పని చేయడం వల్ల నిద్రపోయాడు” అని పేర్కొంది.ఈ నివేదికపై జాంగ్ సంతకం చేశాడు.

ఆ తర్వాత హెచ్‌ఆర్ సిబ్బంది( HR staff ) ఆయనను ఆన్‌లైన్‌లో ఎంతసేపు నిద్రపోయారని అడిగితే, జాంగ్ “ఒక గంట లేదా అంతే” అని సమాధానం ఇచ్చాడు.ట్రేడ్ యూనియన్‌తో సంప్రదించిన తర్వాత, కంపెనీ ఆయనను తొలగించాలని నిర్ణయించింది.

పనిలో నిద్రపోవడం కంపెనీ శిక్షా విధానం ప్రకారం ఉల్లంఘన అని తొలగింపు నోటీసులో పేర్కొంది.జాంగ్ 20 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేశాడు.

ఒక దీర్ఘకాలిక ఉద్యోగ ఒప్పందం కూడా ఉంది.అయినప్పటికీ, కంపెనీ ఆయన్ను కొలువు నుంచి తీసేసింది.

Telugu Chinese, Employee, Job Dismissal, Labor Laws, Zhang, Employershocked, Wor

తనను తొలగించడం అన్యాయమని భావించిన జాంగ్ కోర్టును ( Zhang court )ఆశ్రయించాడు.కంపెనీలు ఉద్యోగులను నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో తొలగించవచ్చు.అయినప్పటికీ, అలా చేయడానికి కొన్ని నిబంధనలు ఉండాలని కోర్టు తెలిపింది.ఈ కేసులో, జాంగ్ నిద్రపోవడం వల్ల కంపెనీకి ఎలాంటి తీవ్ర నష్టం జరగలేదు.ఇది ఆయన మొదటి తప్పు అని కోర్టు గమనించింది.ఆయన 20 సంవత్సరాలుగా మంచి సేవ చేసిన విషయం, అలానే నిద్రపోవడం వల్ల కంపెనీకి పెద్దగా నష్టం జరగలేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, కోర్టు ఆయనను తొలగించడం అన్యాయమని తీర్పు చెప్పింది.అంతేకాదు, సదరు ఉద్యోగికి రూ.41.6 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు కంపెనీని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube