బాదం, జీడిప‌ప్పు, కిస్‌మిస్ ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు

What Is The Best Time To Eat Dry Fruits Daily

డ్రై ఫ్రూట్స్ తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఈ చిన్న చిన్న నట్స్ శరీరంలో ఎన్నో అద్భుతాలను చేస్తాయి.

 What Is The Best Time To Eat Dry Fruits Daily-TeluguStop.com

ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారాలలో నట్స్ అనేవి మొదటి స్థానంలో ఉన్నాయి.ఏదైనా సరైన సమయంలో సరైన మోతాదులో తింటే శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.

నట్స్ శరీరానికి అవసరమైన పోషకాలను అందించి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తాయి.ఏ సమయంలో ఎలాంటి నట్స్ తీసుకుంటే మన శరీరానికి మంచిదో తెలుసుకుందాం

ఉదయం – బాదం సాధారణంగా ఉదయం సమయంలో ఎన్నో పనులు ఉంటాయి.

చాలా మందికి ఉదయం బాదం పప్పు తినే అలవాటు ఉంటుంది.బాదంలో విట‌మిన్ ఇ,రైబోఫ్లావిన్‌, మాంగ‌నీస్ సమృద్ధిగా ఉండుట వలన రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి.

శరీరం మంచి కండిషన్ లో ఉంచటానికి బాదం చాలా సహాయపడుతుంది.బాదంల‌ను రాత్రి ప‌డుకునే ముందు నీటిలో నాన‌బెట్టాలి.

ఉద‌యాన్నే తొక్క తీసి తినాలి.తొక్క‌తో తింటే స‌రైన పోష‌కాలు శరీరానికి అందవని పోష‌కాహార నిపుణులు అంటారు.

రోజుకు 10 బాదం గింజ‌లు తింటే ఎంతో ప్రయోజనం .అంత‌కు మించి తింటే దుష్ప్ర‌భావాలు కలగవచ్చు


సాయంత్రం – జీడిప‌ప్పు, పిస్తా జీడిప‌ప్పులో మంచి కొవ్వులు అధికంగా ఉండుట వలన తక్ష‌ణ శక్తిని అందిస్తాయి.అంతేకాకుండా వీటిని తినటం వలన నోటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా న‌శిస్తుంది.పంటి నొప్పిని తగ్గిస్తుంది.

ఇందులో ఉండే మాంగ‌నీస్ హై బీపీ రాకుండా చూస్తుంది.అంతే కాకుండా కండ‌రాల స‌త్తువ త‌గ్గ‌కుండా చూస్తుంది.

మ‌రో వైపు పిస్తా పప్పు గుండెకు చాలా మంచిది.జీడిప‌ప్పు, పిస్తా రెండు ఆరోగ్యానికి చాలా మంచివి.

త‌క్ష‌ణ శ‌క్తినిస్తాయి.వీటిని సాయంత్రం పూట తింటే అల‌సిన శరీరానికి శ‌క్తి వ‌స్తుంది.

రోజుకు 3 జీడిప‌ప్పు, 3 పిస్తాలు తింటే మంచిదని పోష‌కాహార నిపుణులు సూచిస్తారు

రాత్రి -వాల్‌న‌ట్స్‌, ఖ‌ర్జూరాలు, ఎండు ద్రాక్ష‌ వాల్‌న‌ట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.ఎండు ద్రాక్ష‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది.

ఈ మూడు డ్రై ఫ్రూట్స్ జీర్ణ‌క్రియ‌ల‌ను వేగ‌వంతం చేస్తాయి.చాలా మందికి వాల్‌న‌ట్స్ ఎప్పుడు తినాల‌న్న దానిపై స‌రైన అవ‌గాహ‌న ఉండదు.

వీటిని రాత్రి పూట తిన‌డం చాలా మంచిది.ఈ వాల్ న‌ట్స్ మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నిరోధిస్తుంది.

వీటిలో మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ సమృద్ధిగా ఉండుట వలన శ‌రీరాన్ని రాత్రంతా రిపేర్ చేసి పొద్దున్న క‌ల్లా తాజాగా ఉంచుతుంది.అందుకే వీటిని రాత్రి పూట తినటం చాలా మంచిది.

రోజు ప‌డుకునే ముందు రాత్రి ఒక ఖ‌ర్జూరం, రెండు ఎండు ద్రాక్ష‌, 3 లేదా 4 వాల్‌న‌ట్స్ తింటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube