బ్రెయిన్ ట్యూమర్నేటి కాలంలో ఎందరో ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు.మెదడులో కణతులు ఏర్పడటమే బ్రెయిన్ ట్యూమర్ అంటారు.
కణతులు ఏర్పడటం వల్ల మెదడు పని తీరు దెబ్బ తింటుంది.ఫలితంగా, సదరు వ్యక్తి ఆరోగ్యం, కదలికలు, చురుకుదనం వంటి ఎన్నో కీలక అంశాలపై ప్రభావం పడుతుంది.
అయితే ఈ కణతులను ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చు.కానీ అవగాహన లోపంతో ఈ కణతులను సకాలంలో గుర్తించకపోవడం వల్లే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ముదిరిపోయి చాలా మంది ప్రాణాలను విడుస్తున్నారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు మీలో గనుక ఉంటే ఖచ్చితంగా బ్రెయిన్ ట్యూమరేమోనని అనుమానించాల్సిందే.

ఉన్నట్టు ఉండి జ్ఞాపక శక్తి లోపించడం లేదా ఉన్నట్టు ఉండి ఆలోచించే విధానంలో మార్పులు రావడం బ్రెయిన్ ట్యూమర్ లక్షణంగా చెప్పుకోవచ్చు.బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వ్యక్తిలు జ్ఞాపక శక్తిని సడన్‌గా కోల్పోతారు.ఎప్పుడూ గందర గోళంగా కనిపిస్తుంటారు.
అలాగే ట్యూమర్ ఉన్న వారిలో కంటి చూపు మందగించడం, మసకబారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఫిట్స్ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణంగా చెప్పుకోవచ్చు.
అందులోనూ పద్దెనిమిదేళ్ల వయస్సు దాటిన వారిలో వచ్చే ఫిట్స్ ఎక్కువగా కణతులకు సంబంధించినవే ఉంటాయి.అందువల్ల, తరచూ ఫిట్స్‌కు గురైతే ఖచ్చితంగా వైద్యలను సంప్రదించాల్సి ఉంటుంది.
అలాగే శరీర భాగాల్లో కొన్ని చోట్ల చచ్చుబడిపోవడం, నిటారుగా నిలబడలేకపోవడం, వణుకు వంటివి ట్యూమర్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు.
అంతేకాదు భరించలేనంత తలనొప్పి, తరచూ తీవ్రమైన ఒత్తిడికి గురికావడం, వాంతులు, వికారం, మాట్లాడడానికి మింగడానికి కష్టంగా ఉండటం, ఎప్పుడూ మగత ఉండటం ఇవన్నీ కూడా ట్యూమర్ లక్షణాలే.
కాబట్టి, ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించి అన్ని టెస్ట్‌లు చేయించుకోవడం మంచిది.