మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే.ఆమె మృత దేహం తన ఇంట్లోనే కుటుంబ సభ్యుల సందర్శనార్థం ఉంచారు.
ఇందిర మృతి వార్త విన్న తర్వాత కృష్ణ, మహేష్ బాబు మరియు ఇతర కుటుంబ సభ్యుల రోదనలకు అంతే లేదు.అయినా ఇంతమందిలో కూడా మహేష్ బాబు కూతురు సితార కన్నీరు పెడుతున్న దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టేలా చేస్తున్నాయి.
నాయనమ్మ మృతదేహాన్ని చూసి వెక్కివెక్కి ఏడుస్తోంది సితార.నాయనమ్మ అంశతోనే పుట్టింది సితార అని అంటూ ఉంటారు అందరు.
ఇదే విషయాన్ని బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షోలో మహేష్ బాబు కూడా చెప్పాడు .తన కూతురికి పూర్తిగా తన తల్లి పోలికలు వచ్చాయని కూడా తెలిపాడు.
అంతేకాదు ఇందిర మరియు సితార మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉండేది.మహేష్ బాబు కూడా తనకేదైనా జీవితంలో సమస్య వచ్చినా లేదా తన కెరియర్ లో ఎలాంటి ఒరిదుడుకులు ఎదురైనా వెళ్లి తన తల్లితో కూర్చొని ఒక కప్పు కాఫీ తాగితే చాలు తన సమస్యలన్నీ పోతాయని చెప్పేవాడు.
సితార సైతం తన తండ్రితో వెళ్లి ఈ కాఫీ విత్ నాయనమ్మ అనే కాన్సెప్ట్ తో సమయం గడిపేదట.తనకు ఎంతమంది స్నేహితులు ఉన్నా ఆమె నాయనమ్మతో గడిపే కాలం అంటేనే ఎక్కువగా ఇష్టపడేదట సితార.
అంతేకాదు సితార ఎప్పుడు నాయన నాయనమ్మ దగ్గరికి వెళ్లినా కూడా ట్రెడిషనల్ బట్టల్లో వెళ్లడానికి ఇష్టపడేదట.
సితార చేసే డ్యాన్సులు, కూచిపూడి నృత్యం కూడా ఆమె తన నాయనమ్మ ముందు చూపించి ఈ సంబరపడేదట.మనవరాలు సితార ఎప్పుడు వస్తుందని ఇందిర దేవి ఎదురు చూసేవారట.ఇద్దరూ కలిసి ఎక్కువసేపు సమయం గడిపే వారట.
ఇక సితార సాధారణంగా తెలుగు మాట్లాడదు.మీడియాలో కానీ కుటుంబ సభ్యులందరితో కానీ ఇంగ్లీషులోనే మాట్లాడుతుంది.
కానీ తన నాయనమ్మకు ఇంగ్లీష్ రాదు కాబట్టి కష్టమైన సరే తెలుగు వాక్యాల్లోనే మాట్లాడడానికి సితార ప్రయత్నం చేసేది.సితార కి ఇందిరా దేవికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అందుకే ఇందిరా దేవి కన్నుమూసిన వెంటనే సితార కన్నీరు పెట్టిన తీరు చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.
ఏది ఏమైనా మహేష్ బాబుకి అత్యంత ఇష్టమైన తన తల్లి లేదు అనే వార్త మహేష్ బాబు తో పాటు ఆయన అభిమానుల సైతం ఎంతగానో కలవడానికి గురిచేస్తుంది.