జీర్ణశక్తిని బాగా పెంచే ఫలాలు ఇవి

మెటబాలిజం బాగా ఉండి, తిన్న తిండి సరిగా జీర్ణమయితే ఆరోగ్యంగా ఉండొచ్చు.అజీర్ణం వలన ఎన్నోరకాల సమస్యలు ఉన్నాయి.

 Fruits That Provide Good Fiber Content-TeluguStop.com

ముఖ్యంగా ఒంట్లోని మలినాలు బయటకి రావాలంటే జీర్ణశక్తి బాగా ఉండటం చాలా అవసరం.జీర్ణశక్తి లభించాలంటే ఒంటికి ఫైబర్ అవసరం.

మరి ఫైబర్ బాగా దొరికే ఫలాలు ఏంటో చూద్దామా!
* కోరిందకాయలను తీసుకుంటే ప్రతి వంద గ్రాములకి 7 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

* ఇంట్లో దొరికే జామపండుని చులకనగా చూడొద్దు.

ప్రతి వంద గ్తాముల జామాపండులో 5 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది.

* ప్రతీ వంద గ్రాముల ఆపిల్ లో 2.4 గ్రాముల ఫైబర్ దొరుకుతుంది.కాబట్టి డాక్టర్లు చెబుతున్నట్టుగా రోజుకో ఆపిల్ తినాలి.

* ఆపిల్ లాగే, ప్రతీ వంద గ్రాముల ఆరెంజ్ లో 2.4 గ్రాముల ఫైబర్ దొరుకుతుంది.దీంట్లో విటమిన్ సి లెవెల్స్ ఎక్కువ ఉండటం మరో అదనపు లాభం.

* ఆరటిపండు కూడా డైటరీ ఫైబర్ ని అందిస్తుంది.ప్రతి వంద గ్రాముల అరటిపండులో 2.6 గ్రాముల డైటరీ ఫైబర్ దొరుకుతుంది.

* స్ట్రాబెరిలో ప్రతి వంద గ్రాములకి 2 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది.

* పెర్సిమ్మన్, మామిడికాయలో కూడా డైటరీ ఫైబర్ బాగానే దొరుకుతుంది.మన శరీరానికి రోజుకి 25-30 గ్రాముల డైటరీ ఫైబర్ అవసరం.కాబట్టి, మన ఆహారపు అలవాట్లు, వాటిలో దొరికే ఫైబర్ కంటెంట్ ని బట్టి రోజూ ఏ ఫలం తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube