13 ఏళ్లకే సన్యాసినిగా మారిన బాలిక.. కుంభమేళాలో ఈ ఘటనపై మీరేమంటారు..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు ( Maha Kumbh Mela )ఉత్తరప్రదేశ్ సిద్ధమవుతోంది.ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ మహా ఆధ్యాత్మిక వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు.

 A Girl Who Became A Nun At The Age Of 13 Will Tell You About This Incident In Th-TeluguStop.com

అయితే, ఈసారి కుంభమేళా ప్రారంభానికి ముందే ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.కేవలం 13 ఏళ్ల వయసున్న దళిత బాలిక సన్యాసినిగా మారడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Telugu Dalit, Hindu Saint, Kumbh Mela, Maha Kumbh, Prayagraj-Latest News - Telug

రాఖీ ధాకరే ( Rakhi Dhakare )అనే ఈ చిన్నారి సన్యాసం స్వీకరించి ఇప్పుడు సన్యాసిని గౌరీ గిరిగా మారిపోయింది.ముక్కు పచ్చలారని చిన్న వయసులో ఆ బాలిక కుటుంబ బంధాలను తెంచుకుని గురువు చెంతన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతోంది.చిన్నప్పటి నుంచే సన్యాసంపై ఆసక్తి పెంచుకున్న రాఖీ 11 ఏళ్ల వయసులో గురు దీక్ష తీసుకుంది.ఆ తర్వాత రెండేళ్లకే, అంటే 13 ఏళ్ల వయసులో పూర్తిస్థాయి సన్యాసినిగా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Telugu Dalit, Hindu Saint, Kumbh Mela, Maha Kumbh, Prayagraj-Latest News - Telug

“చిన్నప్పటి నుంచే సన్యాసిని కావాలని నా కల.కానీ నేను చిన్నదాన్ని కావడంతో ఇంట్లో వాళ్లు నా కోరికను సీరియస్‌గా తీసుకోలేదు” అని సన్యాసిని గౌరీ గిరి చెప్పడం విశేషం.మొదట్లో ఆమె గురువు మహంత్ కౌశల్ గిరి కూడా ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు.“సన్యాసుల జీవితం చాలా కష్టాలతో కూడుకున్నది.నువ్వు ఇంకా చాలా చిన్నదానివి” అని వారించారట.అయినా సరే వదలకుండా గౌరీ గిరి తన పట్టుదలతో గురువును ఒప్పించగలిగింది.మహా కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు, సాధువులు, సన్యాసులు దీవెనల కోసం, జ్ఞానోదయం కోసం తరలివస్తారు.అలాంటి పవిత్రమైన సందర్భంలో సన్యాసిని గౌరీ గిరి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడం చర్చనీయాంశమయ్యింది.

నెటిజన్లు ఈ ఘటన పై రకరకాల అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube