ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు చేస్తున్న పనులు చూస్తుంటే మన మైండ్ బ్లాక్ అవ్వక తప్పడం లేదు.తాజాగా ప్రముఖ ట్రాన్స్‌జెండర్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎమిలీ జేమ్స్ తన శరీరంలోని పక్కటెముకలను తొలగించుకుని వాటిని కిరీటంలో పెట్టుకోవాలని చేసిన వినూత్న ఆలోచన ఇంటర్నెట్‌ను షాక్‌కి గురి చేసింది.27 ఏళ్ల ఈ “సెక్స్ థెరపిస్ట్” ( Sex Therapist )తన నడుమును మరింత సన్నగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా ఆరు పక్కటెముకలను తొలగించుకోవడానికి దాదాపు రూ.14 లక్షలు ఖర్చు చేసింది.
“ఆ పక్కటెముకలను పెట్టి ఒక కిరీటం చేయించుకోవాలని అనుకుంటున్నాను,” అని ఎమిలీ న్యూయార్క్ పోస్ట్‌కి ( Emily New York Post )ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.మొదట్లో వాటిని తన బెస్ట్ ఫ్రెండ్‌కు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నా, ఆ ఆలోచనను మార్చుకుని తనకోసం ఒక ప్రత్యేకమైన జ్ఞాపికగా మలుచుకోవాలని నిర్ణయించుకుంది.
ప్రస్తుతం ఎమిలీ ఆపరేషన్ నుంచి కోలుకుంటోంది.ఇన్‌ఫ్లమేషన్ ను తగ్గించడానికి రోజూ కార్సెట్ ధరిస్తోంది.సర్జరీ చాలా బాధాకరంగా ఉన్నా, తన డాక్టర్లు, నర్సుల సహాయంతో ప్రస్తుతం నొప్పి స్థాయి పదికి రెండుగా ఉందని ఆమె తెలిపింది.
ఎమిలీ తన పక్కటెముకల తొలగింపు ప్రయాణాన్ని సోషల్ మీడియాలో డాక్యుమెంట్ చేస్తోంది.సర్జరీకి ముందు ఆమె మాట్లాడుతూ “మూడు రోజుల్లో, నా రెండు వైపుల నుంచి మూడు పక్కటెముకలు తొలగించనున్నాయి,” అంటూ చెప్పింది.ఆపరేషన్ తర్వాత, ఆమె తన ఫాలోవర్స్‌కు తన కోలుకునే విధానం, పక్కటెముకల కోసం చేసిన ప్లాన్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తోంది.
పక్కటెముకలను తాను ఉంచుకున్నానని వెల్లడించిన తర్వాత, సోషల్ మీడియా యూజర్లు వాటిని నమలడానికి బొమ్మగా మార్చడం లేదా సూప్‌లో ఉడకబెట్టడం వంటి ఆలోచనలు చెప్పారు.దీనికి ఎమిలీ ఫన్నీగా స్పందిస్తూ, “నా మాంసం చాలా రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యపరమైన కారణాల వల్ల తన ఎముకలను తినన”ని స్పష్టం చేసింది.
విమర్శలు వచ్చినా, ఎమిలీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.“ఇది నా శరీరం, నా డబ్బు, నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను,” అని ఆమె పేర్కొంది.చాలామంది అందాన్ని మెరుగుపరుచుకోవడానికి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటారని ఆమె గుర్తు చేసింది.“నా పక్కటెముకలు తీయించుకున్నంత మాత్రాన నేను దయగల, ప్రేమగల ట్రాన్స్ అమ్మాయిని కాకుండా పోను,” అని ఎమిలీ తెలిపింది.ద్వేషించేవారిని పట్టించుకోకుండా తన సంతోషంపై దృష్టి పెడుతున్నానని ఆమె చెప్పింది.ఈ వార్త ప్రస్తుతం డిజిటల్ ఒక ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.