రోజు ఈ జ్యూస్ తాగితే రక్తహీనత ఎంత తీవ్రంగా ఉన్నా 2 వారాల్లో పరారవుతుంది!

రక్తహీనత. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న సర్వసాధారణమైన అనారోగ్య సమస్య ఇది.పోషకాల కొరత రక్తహీనతకు ప్రధాన కారణం.ఎప్పుడైతే రక్తహీనతకు గురవుతారో నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మం పాలిపోవడం, జుట్టు రాలడం, కంటి చూపు మందగించడం తదితర లక్షణాలన్నీ తలెత్తుతుంటాయి.

 If You Drink This Juice Daily You Will Get Relief From Anemia Details! Anemia, A-TeluguStop.com

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేసే కొద్ది రక్తహీనత ముదిరిపోతుంటుంది.దీంతో ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.అందుకే రక్తహీనతను వదిలించుకోవడం కోసం చాలా మంది ఐరన్ సప్లిమెంట్ వాడుతుంటారు.అయితే సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను తాగితే రక్తహీనత ఎంత తీవ్రంగా ఉన్న రెండు వారాల్లో పరారవుతుంది.

మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక యాపిల్ ను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక చిన్న కీర దోసకాయను తీసుకుని నీటిలో కడిగి పీల్‌ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, కీర ముక్కలు, ఐదారు ఫ్రెష్ పాలకూర ఆకులు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Anemia, Applecucumber, Tips, Latest-Telugu Health

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు, వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన జ్యూస్ సిద్ధమవుతోంది.సూపర్ టేస్ట్ ను కలిగి ఉండే ఈ ఆపిల్ కీర పాలకూర జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా రక్తహీనతను త‌రిమికొట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

రోజుకు ఒక గ్లాస్ ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే శరీరానికి సరిపడా ఐరన్ అందుతుంది.దీంతో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

ఫలితంగా రక్తహీనత సమస్య దూరం అవుతుంది.అంతేకాదు ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం సైతం తగ్గుతుంది.

కాబట్టి ఈ హెల్తీ అండ్ టేస్టీ జ్యూస్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube