ప్రస్తుత రోజుల్లో గ్రీన్ టీ( Green tea ) గురించి పరిచయాలు అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాల్లో గ్రీన్ టీ ఒకటిగా మారింది.
ముఖ్యంగా హెల్త్, ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్నవారు తప్పకుండా తమ డైట్ లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటున్నారు.బరువు తగ్గడానికి గ్రీన్ టీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
అలాగే పలు హెల్త్ బెనిఫిట్స్ ను సైతం అందిస్తుంది.మీరు కూడా గ్రీన్ టీ ప్రియులా.? రోజూ గ్రీన్ టీను తాగుతుంటారా.

అయితే గ్రీన్ టీను నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరింత వేగంగా వెయిట్ లాస్ అవుతారు.అలాగే ఎక్కువ ఆరోగ్య లాభాలు సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు గ్రీన్ టీను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఎనిమిది నుంచి పది ఫ్రెష్ పుదీనా ఆకులు, మూడు కీరా దోసకాయ( Cucumber ) స్లైసెస్ వేసుకుని పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ ను బాగా డిప్ చేసి నాలుగు నిమిషాల పాటు వదిలేయాలి.ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ ను తొలగించి వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి సేవించడమే.ఈ మింట్ కుకుంబర్ గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

గ్రీన్ టీను నేరుగా కంటే ఈ విధంగా తీసుకోవడం వల్ల మరింత త్వరగా బరువు తగ్గుతారు తగ్గుతారు.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.మధుమేహం ఉన్నవారు తేనె కలపకుండా ఈ మింట్ కుకుంబర్ గ్రీన్ టీ ను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్( Blood Sugar ) లో ఉంటాయి.చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా మారుతుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది.మోకాళ్ళ నొప్పులు ఉంటే తగ్గుముఖం పడతాయి.
రక్తపోటు అదుపులో ఉంటుంది.మెదడు చురుగ్గా పని చేస్తుంది.
జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.జలుబు దగ్గు వంటివి ఉన్నా సరే దూరం అవుతాయి.