హైదరాబాద్ వనస్థలిపురంలోని కమ్మగూడలో దారుణ హత్య జరిగింది.తెల్లవారు జామున వాకింగ్ చేస్తున్న జార్జ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు రాడ్లతో దాడికి పాల్పడ్డారు.
తీవ్ర గాయాలు కావడంతో జార్జ్ అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.గత కొంతకాలంగా మృతుడు జార్జ్ కు, మరో వ్యక్తి సర్దార్ సమర్జిత్ సింగ్ కు మధ్య భూ తగాదాలు నడుస్తున్నట్లు సమాచారం.కాగా సర్దార్ సమర్జిత్ సింగ్ పరారీలో ఉండగా.12 గుంటల భూ వివాదమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.