బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిస్థాయిలో ఫెయిలైంది.అయితే బిగ్ బాస్ సీజన్6 ఫెయిల్యూర్ కు కారణాలేంటనే ప్రశ్నకు ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ షో టీవీతో పాటు ఓటీటీలో అందుబాటులో ఉంది.ఓటీటీలో ఈ షోను చూసే ప్రేక్షకులు టీవీలో ఈ షోను చూడకపోవడం ఈ షో రేటింగ్స్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.
ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి క్రేజ్ లేని కంటెస్టెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా సీజన్6 ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడానికి కారణమని చెప్పవచ్చు.ఇనయా సుల్తానా, గీతూ రాయల్, బాలాదిత్య, సుదీప, అభినయశ్రీ ఎలిమినేషన్ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగా లేరు.
బిగ్ బాస్ సీజన్6 ఫ్లాప్ వెనుక ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.బిగ్ బాస్ సీజన్6 లో కొన్ని జోడీలు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
ఈ సీజన్ లో ఏ జోడీ మెప్పించలేకపోవడం ప్రేక్షకులను సైతం తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.ఈ సీజన్ ఫెయిల్యూర్ కావడానికి ముఖ్యమైన కారణాలలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు.ఈ సీజన్ లో టాస్క్ లు రొటీన్ గా ఉండటం, కంటెస్టెంట్లు టాస్క్ ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా రేటింగ్ పై ప్రభావం చూపింది.కంటెస్టెంట్ల బలహీనతలు ఈ షోకు మైనస్ అయ్యాయి.
మరీ సీరియస్ టాస్క్ లను పెట్టడంతో ఎంటర్టైన్మెంట్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఆ టాస్క్ లు ఎక్కువగా నచ్చలేదు.క్రికెట్ మ్యాచ్ లు కూడా ఈ షో రేటింగ్ పై ప్రభావం చూపాయి.గత సీజన్లతో పోల్చి చూస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.