శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం,కొన్ని అనారోగ్య సమస్యలు కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.శరీరంలో నీటి శాతం తగ్గి కాల్షియం, ఫాస్ఫేట్స్, ఆక్సిలేట్స్ వంటి రసాయనాలు పేరుకొని పోయి కిడ్నీలో రాళ్ళగా మారతాయి.
కిడ్నీలో రాళ్లు ఉన్నాయంటే విపరీతమైన నొప్పి కలుగుతుంది.ఆ బాధను అసలు తట్టుకోవటం చాలా కష్టం.
కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు డాక్టర్ కి చూపించుకోవాలి.డాక్టర ఇచ్చిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను పాటిస్తే ఉపశమనం తొందరగా కలుగుతుంది.
ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ తులసి రసంలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగాలి.ఇలా క్రమం తప్పకుండ మూడు నెలల పాటు చేయాలి.
ఉలవల్లో ముల్లంగి ఆకులను వేసి బాగా మరిగించాలి.ఈ నీటిని వడకట్టి చారుగా తయారుచేసుకొని అన్నంలో కలుపుకొని తింటే కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగిపోతాయి.
తాజా మామిడి ఆకులను నీడలో ఆరబెట్టి పొడిగా తయారుచేసుకోవాలి.ఈ పొడిలో నీటిని కలిపి ప్రతి రోజు ఉదయం తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుతుంది.
తరచుగా ఆపిల్ జ్యుస్ త్రాగుతూ ఉంటే నిదానంగా చిన్న చిన్న రాళ్లు కరిగిపోతాయి.ఆపిల్ లో ఉండే లక్షణాలు రాళ్లను కరిగిస్తాయి.
అయితే పెద్ద రాళ్లు అయితే కాస్త సమయం పడుతుంది.
రెండు కప్పుల నీటిలో కొత్తిమిర వేసి ఒక కప్పు నీరు అయ్యేవరకు మరిగించాలి.
ఈ నీటిని వడకట్టి ప్రతి రోజు త్రాగాలి.ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే కిడ్నీలో రాళ్లు క్రమంగా తగ్గిపోతాయి.