స్టార్ హీరో బాలయ్య వయస్సు ప్రస్తుతం 64 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.ఈ వయస్సులో కూడా బాలయ్య అదిరిపోయే యాక్షన్స్ సీక్వెన్స్ లు ఉన్న సినిమాలలో నటించడంతో పాటు వరుస విజయాలను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు.
బాలయ్య నటించి తాజాగా విడుదలైన డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య ఖాతాలో మరో భారీ సక్సెస్ చేరిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.సంక్రాంతి పండగ బాలయ్యకు అచ్చొచ్చిన పండగ కాగా డాకు మహారాజ్ తో ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది.
కథ :
మదనపల్లెలోని విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ కేద్కర్) ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవికిషన్) తన ఎస్టేట్ వేదికగా చేస్తున్న అక్రమాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు.త్రిమూర్తులు ఆగడాలను చూడలేక కృష్ణమూర్తి పోలీసులను ఆశ్రయించడంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలైన వైష్ణవి (వేద అగర్వాల్) కు అపాయం తలపెట్టగా ఆ చిన్నారిని కాపాడటానికి నానాజీ (బాలకృష్ణ) వస్తాడు.
వైష్ణవిని కాపాడిన నానాజీ నేపథ్యం ఏమిటి? సివిల్ ఇంజనీర్ గా పని చేసే సర్కారి సీతారాం(బాలయ్య) డాకు మహారాజ్ గా ఎందుకు మారాడు? బల్వంత్ ఠాకూర్ (బాబీ డియోల్) చేస్తున్న అక్రమాలకు డాకు ఎలా చెక్ పెట్టాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
బాలయ్య సినిమా అంటే బాలయ్య వన్ మ్యాన్ షో అనే విధంగా సినిమా ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటారు.డాకు మహారాజ్ సినిమా కూడా బాలయ్య వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు.సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు బాలయ్య ప్రతి సీన్ లో అదరగొట్టారు.
ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రల నిడివి తక్కువే అయినా ఈ ఇద్దరు హీరోయిన్లకు మంచి పాత్రలే దక్కాయని చెప్పవచ్చు.బల్వంత్ ఠాకూర్ పాత్రలో బాబీ డియోల్ అద్భుతంగా నటించారు.
బాలయ్యకు ధీటైన విలన్ అని ఆయన అనిపించుకున్నారు.షైన్ టామ్ చాకోకు మంచి పాత్రే దక్కినా ఆ పాత్రను పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దలేదు.
ఊర్వశి రౌతేలా రోల్ ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు.చైల్డ్ ఆర్టిస్ట్ వేద అగర్వాల్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు :
బాలయ్య సినిమాలకు అఖండ సినిమా నుంచి వరుసగా పని చేస్తున్న థమన్ మరోసారి బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు.డాకు మహారాజ్ మూవీ సక్సెస్ లో బీజీఎం కీలక పాత్ర పోషించింది.దర్శకుడు బాబీ రొటీన్ కథనే ఎంచుకున్నా కథనంతో మ్యాజిక్ చేశారు.సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలకు అయితే కొదువ లేదు.నిర్మాత నాగవంశీ 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో డాకు మహారాజ్ సినిమాను నిర్మించగా ఆ బడ్జెట్ కు ఈ సినిమా న్యాయం చేసిందని కచ్చితంగా చెప్పవచ్చు.సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సైతం బాగున్నాయి.
టెక్నికల్ విభాగాలకు సంబంధించి పని చేసిన నిపుణులు బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్లు :
బాలయ్య
ప్రగ్యా జైస్వాల్
థమన్ బీజీఎం, దబిడి దిబిడే సాంగ్
యాక్షన్, ఎలివేషన్ సీన్స్
మైనస్ పాయింట్లు :
కథలో కొత్తదనం లేకపోవడం
ఫస్టాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు
బాలయ్య గత సినిమాలను గుర్తు చేసే సీన్స్
రేటింగ్ :
3.0/5.0