తెలుగు చిత్ర పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సింగర్ మధుప్రియ ( Madhu Priya ) ఒకరు.ఇటీవల వరుస సినిమాలలో పాటలు పాడుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె మరోవైపు ప్రవైట్ ఆల్బమ్స్ ( Pravite Album ) .
కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న మధుప్రియ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు.
ఈ వివాదం కారణంగా ఏకంగా ఈమెను అరెస్టు చేసి జైలుకు పంపించాలి అంటూ డిమాండ్లు చేస్తున్నారు.ఇలా ఈమె వివాదంలో చిక్కుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.
ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న మధుప్రియ తాజాగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో షూటింగ్ చేయడం వివాదానికి దారి తీసింది. ఈ ఆలయంలో భక్తులు స్వామివారి ఫోటోలు వీడియోలు తీయడానికి అనుమతి లేదు.అలాంటిది ఈమె ఏకంగా ఆలయ గర్భగుడిలోకి వెళ్లి షూటింగ్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయంపై హిందూ సంఘాల నేతలు, భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ పాట షూటింగ్ సమయంలో భక్తులు ఎవరు లోపలికి రాకుండా ఆలయం తలుపులు మూసివేసి మరి షూటింగ్ చేశారు.దీంతో భక్తులు ఈ ఘటన పై స్పందిస్తూ మేము ఆలయం లోపల ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతి తెలుపరు.అలాంటిది మధుప్రియకు షూటింగ్ చేసుకోవడానికి ఎలా అనుమతి తెలిపారు అంటూ ఆలయ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు.
మధుప్రియ ఇలాంటి చర్యలకు పాల్పడి హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసారని తద్వారా ఈమెపై చర్యలు తీసుకుంటూ తనని అరెస్టు చేయాలి అంటూ హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇప్పటివరకు మధుప్రియ ఈ వివాదం గురించి ఎక్కడ స్పందించలేదు.
మరి ఈమె స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.