ప్రతి ఒక్కరికి కూడా అందంగా కనిపించాలని కోరిక ఉంటుంది.ఇక తమ చర్మం కాంతివంతంగా( Skin glow ) మెరిసేందుకు చాలా మంది ఎన్నో రకాల స్కిన్ కేర్ లు, కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు.
అయితే కేవలం కాస్మెటిక్స్ వాడడం మాత్రమే కాకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించాలని అవగాహన చాలామందికి ఉండదు.చర్మంపై ఏవేవో ప్రయోగాలు చేస్తూ వేలకు వేలు ఖర్చు పెడితే మన చర్మం అందంగా మెరిసిపోదు.
అయితే సింపుల్ గా మన ఇంట్లోనే ఉన్న వస్తువులతో మనం అందంగా మెరిసిపోవచ్చు.అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టమా( Tomato )టాను గుండ్రంగా కట్ చేసుకుని ముక్కను తీసుకొని దానికి పంచదార అద్దాలి.

ఆ తర్వాత ఆ ముక్కను ముఖంపై మెల్లగా రుద్దాలి.ఒక పది నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడుక్కోవాలి.ఇక ఆ తర్వాత ఒక స్పూను శనగపిండి, అర స్పూన్ అలోవెరా జెల్, రెండు స్పూన్ల టమాటా రసం, అర స్పూన్ తేనె వేసి పేస్టులా చేసుకోవాలి.
ఇక ముఖంపై ఆ పేస్ట్ ని ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి.ఇలా చేయడం వలన ముఖంపై ఉన్న మృత కణాలు( Dead Skin Cells ), టాన్ పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల పాలలో, అర స్పూన్ తేనె కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి.ఆ తర్వాత వేళ్ళతో మెల్లగా మసాజ్ చేసుకోవాలి.

ఇలా పడుకునే ముందు ప్యాక్ వేసుకొని చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా చేయడం వలన డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి.ఇక కొద్దిగా కాఫీ పౌడర్( Coffee Powder ) అలాగే కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేయాలి.వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి.ఇది చర్మాన్ని ఎక్స్పోజింగ్ చేయడం మాత్రమే కాకుండా మృదువుగా కూడా మారుస్తుంది.
దీంతో చర్మం కూడా ఎంతో తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.ఇక ఒక కప్పు గ్రీన్ టీని బ్రూ చేసి చల్లారనివ్వాలి.
ఇక దీన్ని స్కిన్ టోనర్ గా ఉపయోగించుకోవాలి.దీన్ని తరచుగా ముఖంపై టోనర్ గా ఉపయోగించడం వలన స్కిన్ టోన్ పెరుగుతుంది.







