వర్షాకాలం( Rainy season ) వచ్చిందంటే చాలు వంటగది వస్తువులు అన్నీ కూడా చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి.మరి ముఖ్యంగా పిండి, బియ్యం, సుగంధద్రవ్యాలలో కీటకాలు వచ్చేస్తూ ఉంటాయి.
అయితే మనకు వీటిలో చాలా బియ్యం చాలా ముఖ్యమైనవి.ఎందుకంటే అన్నం లేనిదే రోజు గడవదు.
మనందరం అన్నం కోసమే ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటాం.అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో బియ్యం రెండు మూడు నెలలకు సరిపడేలా కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు.
ఇలా బియ్యం నిల్వ చేసుకోవడం వలన అన్ని విధాల మంచిదే.కానీ నిల్వ చేసుకున్న బియ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

లేదంటే నిల్వచేసిన బియ్యంలో పురుగులు చేరిపోతాయి.ఆ పురుగులు విసర్జించే వ్యర్ధాలు, మలినాలు బియ్యంలో ఉండిపోతాయి.ఇక ఇలా పురుగులు పట్టిన బియ్యం తినడం వలన మనకు జీర్ణ సంబంధిత రోగాలు( Digestive diseases ) కూడా వస్తాయి.అందుకే బియ్యంలో పురుగులు పట్టకుండా చూసుకోవడం చాలా అవసరం.
వంటగదిలో ఉంచిన కూరగాయలు, మసాలా దినుసులు, ధాన్యాలు సరిగా నిల్వ చేయడం చాలా అవసరం.వాటిని కీటకాల బారిన పడకుండా చూసుకోవాలి.
అందుకే ఏ వస్తువైనా గాని తెరిచి ఉంచకూడదు.ప్యాకెట్లలో ఉంచకూడదు.
ఇక పిండిని ప్యాకెట్ లో కూడా ఉంచకూడదు.

పిండిని మూసిన కంటైనర్ లో ఉంచాలి.ఎందుకంటే కంటైనర్ లో అయితే గాలి చొరబడకుండా ఉంటుంది.దీంతో పురుగులు కూడా ప్రవేశించలేవు.
ఇక పిండి లేదా బియ్యం లో ఏడు నుండి ఎనిమిది బే ఆకులను వేసి మూసి ఉంచాలి.ఇది పిండిలోకి, బియ్యంలోకి కీటకాలు ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
ఇక బియ్యంలో లవంగాలను( Clove ) కూడా ఉంచవచ్చు.లవంగాల వాసన వలన పిండి లేదా బియ్యంలో దుర్వాసన ఉండదు.
దీంతో కీటకాలు అందులోకి ప్రవేశించవు.లవంగాలకు బ్యాక్టీరియాను తొలగించే శక్తి కూడా ఉంది.
అంతేకాకుండా ఏలకులను కూడా మనం ఉపయోగించవచ్చు.బియ్యం లోపల యాలకులు ఉండడం వలన పురుగులు సోకకుండా ఉంటాయి.







