రీమేక్ అన్న పదం వినగానే తెలుగు పరిశ్రమలో మనకు గుర్తుకొచ్చే పేరు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).అప్పుడెప్పుడో 1996లో వచ్చిన మొదటి సినిమా “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రం నుంచి మొన్నమొన్నటి “బ్రో”( bro ) వరకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తం 28 చిత్రాలలో నటించారు.
ఐతే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ఈ 28 చిత్రాలలో 13 చిత్రాలు రీమేక్ చిత్రాలే.

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన చిత్రాలన్నీ గమనిస్తే ఒక విషయం తెలుస్తుంది.అదేంటంటే ఆయన రీమేక్ చిత్రాలలో ఎక్కువ చిత్రాలు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ( Dalapathy Vijay )సినిమాలే.యువతలో పవన్ క్రేజ్ పెంచిన సినిమా “సుస్వాగతం”.1998లో విడుదలైన ఈ చిత్రం 1997 లో తమిళ్ లో విడుదలైన “లవ్ టుడే” చిత్రానికి రీమేక్.పవన్ కళ్యాణ్ స్థాయిని మరో మెట్టు ఎక్కించిన చిత్రం “ఖుషి”.
ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2001లో విడుదలయింది.ఐతే ఈ చిత్రాన్ని రెండు భాషలలో తెరకెక్కించాలని దర్శకుడు ముందే నిర్ణయించుకున్నారు.
ఈ కథ వినిపించింది మొదట పవన్ కళ్యాణ్ కె అయినప్పటికీ మొదట సెట్స్ పైకి వెళ్ళింది మాత్రం తమిళం లోనే.ఇలా ఖుషి( Khushi ) చిత్రం విజయ్ హీరోగా 2000లో తమిళం లోను, పవన్ కళ్యాణ్ హీరోగా 2001లో తెలుగు లోను విడుదలయింది.
పవన్ కళ్యాణ్ నటించిన “అన్నవరం” చిత్రం కూడా విజయ్ తమిళ్ లో చేసిన ఒక సినిమా రీమేక్ రూపమే.ఇదే చిత్రం విజయ్ హీరోగా 2005 లో “తిరుప్పాచ్చి” గా విడుదలయింది.
ఈ కథనే “అన్నవరం” గా రీమేక్ చేసారు పవన్ కళ్యాణ్.ఐతే ఈ మూడు చిత్రాల్లో రెండు సువర్ హిట్స్ కాగా, ఒకటి మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.

ఈ మూడు చిత్రాలు కాకుండా పవన్ కళ్యాణ్ మరో 10 రీమేక్ చిత్రాలలో నటించారు.పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తరువాత నటించిన చిత్రాలన్నీ రీమేక్ చిత్రాలే.ఐతే ఈ రీమేక్ ఫార్ములా పవన్ కళ్యాణ్ కు బాగానే వర్క్ అవుట్ అయ్యింది.ఆయన రీమేక్ చేసిన ఈ 13 చిత్రాలతో 8 చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.