సమస్యల వలయంలో రాజన్నపేట కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా :కేటీఆర్( K.T.Rama Rao ) దత్తత గ్రామమైన రాజన్నపేటలోని అభివృద్ధి ఏమైందని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ప్రశ్నించారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఆయన మాట్లాడారు.
రాజన్నపేట గ్రామం( Rajannapeta ) ఇంకా సమస్యల వలయంలోనే ఉందని అభివృద్ధి జాడ కనిపించడం లేదన్నారు.నియోజకవర్గంలో ఎక్కడ మంత్రి దత్తత గ్రామం తీసుకున్న అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.
మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ వీర్నపల్లి మండలాన్ని దత్తత తీసుకొని ఎంత అభివృద్ధి చేశాడని ప్రశ్నించాడు.
నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) పట్ల ఆదరణ పెరుగుతుందని స్థానికుడైన నాకు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి ఓటమి ఖాయమని నిరాశతోనే మంత్రి తాను ఓడిపోతే ఎట్లా అని ప్రజలను ప్రశ్నించడం జరుగుతుందన్నారు.ఒక ప్రభుత్వం పడిపోతే ఇంకో ప్రభుత్వం అంతకంటే మెరుగైన పథకాలు అందిస్తుందని పరిపాలన కూడా ప్రజారంజకంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీ , నాయకులు కటిక రవి ,గోగూర్ బాపురెడ్డి, భాస్కర్ రెడ్డి, చెన్ని బాబు, గంట బుచ్చగౌడ్, రామ్ రెడ్డి ,బానోతు రాజు నాయక్, నేలపల్లిశ్రీనివాస్, సోనవేని రాజయ్య, సురేష్ బాలయ్య, పరశురాములు , సతీష్, చెరుకు ఎల్లయ్య, రొడ్డ రామచంద్రం ,గుండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.