అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి కామెంట్స్... అసలు సినిమా ముందుంది అంటూ?

ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి(Venu Swamy) గత కొద్దిరోజులుగా సినిమా సెలబ్రిటీల జాతకాలను చెప్పడం మానేశారు నాగచైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత ఈయన వారి జాతకం గురించి మాట్లాడుతూ వీరిద్దరూ విడిపోతారని చెప్పారు.దీంతో ఈయనపై ఫిలిం జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈయన కొద్ది రోజులుగా సెలబ్రిటీల జాతకాలను చెప్పడం మానేశారు అయితే అల్లు అర్జున్ ( Allu Arjun ) అరెస్ట్ అయినప్పటి నుంచి ఈయన తిరిగి జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

 Venu Swamy Once Again Sensational Comments On Allu Arjun , Allu Arjun,sukumar,ve-TeluguStop.com

అల్లు అర్జున్ పుష్ప 2( Pushpa 2)  సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే ఈ సినిమా తర్వాత వరుస వివాదాలలో నిలుస్తున్నారు.

ఈ సినిమా విడుదల సమయంలో తొక్కిసలాట జరిగి ఒక అభిమాని మరణించడంతో అందుకు అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది అలాగే చిత్ర నిర్మాతలు దర్శకుడు పై కూడా ఐటి రైడ్స్ జరగడం వెనుక అల్లు అర్జున్ జాతకమే అంటూ వేణు స్వామి మరొక వీడియోని విడుదల చేశారు.తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుంది.

Telugu Allu Arjun, Pushpa, Sukumar, Venu Swamy, Venuswamy-Movie

ఇందులో భాగంగా వేణు స్వామి మాట్లాడుతూ.అల్లు అర్జున్ ది కన్యారాశి, సుకుమార్( Sukumar )గారిది కుంభ రాశి.వీళ్ల జాతకాలు షష్టాష్టకం కాంబినేషన్.వీళ్ళ జాతకంలో శని స్థానం బట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.ఈ రెండు జాతకాలు కలవటం వల్ల ఫైర్ బ్లాస్ట్ అవుతుందని తద్వారా చుట్టుపక్కల వారికి ఇబ్బందులు తప్పవని తెలిపారు.ఇక అల్లు అర్జున్ జాతకం మార్చి 30వ తేదీ వరకు ఇలాగే ఉంటుందని తెలిపారు.

Telugu Allu Arjun, Pushpa, Sukumar, Venu Swamy, Venuswamy-Movie

ఇప్పటివరకు అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఆరెస్టులు ఐటి రైట్స్ వంటివి కేవలం ట్రైలర్ టీజర్ లాంటివి మాత్రమేనని తెలిపారు.అసలు సినిమా మార్చి 30 తర్వాత ఉంటుందని తెలిపారు.ఉగాది నుంచి శని తులారాశిలోకి వెళ్లడం వల్ల తెలుగు ఇండస్ట్రీ మీద, తెలుగు రాజకీయాల మీద ఎంతో ప్రభావం ఉంటుంది అప్పుడు అసలు సిసలైన సినిమాని చూస్తాము అంటూ అల్లు అర్జున్ జాతకం గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube