సాధారణంగా గుడ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.ఉడికించిన గుడ్లు( Boiled Eggs ) మన శరీరానికి మంచి పోషకాహారం అని చెప్పవచ్చు.
గుడ్డులో దాదాపు 78 క్యాలరీలు ఉంటాయి.ఇందులో శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రోటీన్లు, విటమిన్ డి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
రోజుకు ఒకటి ఉడికించిన గుడ్డు తింటే ఒక వారంలో మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి.గుడ్లలో విటమిన్ బి( Vitamin B ) పుష్కలంగా ఉంటుంది.
శరీరంలో వచ్చే అనేక వ్యాధులను త్వరగా నయం చేయడంలో గుడ్లు ఎంతగానో సహాయపడతాయి.ఉడికించిన గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.
ఇవి మనకు బలాన్ని కూడా అందిస్తాయి.ఇది ఎముకలను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.

అంతేకాకుండా ఉడికించిన గుడ్లలో ఉండే కోలిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.అలాగే శరీరాన్ని బలోపేతం చేయడానికి కూడా బాగా సహాయపడతాయి.ఇక శరీరంలోని కండరాలను( Muscles ) బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఒక గుడ్డు తినడం చాలా మంచిది.గుడ్డులోని తెల్ల సోనలో ప్రోటీన్లు, అమినో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఇక ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఇవి కంటి సమస్యలను( Eye Sight ) నయం చేయడంలో కూడా ఎంతగానో మేలు చేస్తాయి.ఇక ఉడికించిన గుడ్లలో కేరోటినాయిడ్స్ పుష్కలంగా లభిస్తుంది.

పెరుగుతున్న వయసు వలన ప్రజలు అనేక కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.కాబట్టి ఉడికించిన గుడ్డు తినడం వలన కంటి సమస్యలు దూరం అవుతాయి.ఉడికించిన గుడ్డును ఖాళీ కడుపుతో తినడం వలన మంచి లాభాలు కలుగుతాయి.ఇక రోజంతా అలసట కారణంగా స్టామినా( Stamina ) చాలా బలహీనంగా మారిపోతుంది.కాబట్టి మీ శరీరం దృఢంగా ఉండాలంటే రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినడం చాలా మంచిది.రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుడ్లు తింటే శరీరానికి రెట్టింపు బలం చేకూరడంతో పాటు అనేక వ్యాధుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.
శరీరంలో శక్తిని పెంచడంలో గుడ్లు సహాయకరంగా కూడా పనిచేస్తాయి.







