కత్తిపోట్ల వల్ల సైఫ్ అలీ ఖాన్ కు అన్ని వేల కోట్ల రూపాయల నష్టమా.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) ఇంట్లోకి చొరబడి ఒక దుండగుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.అతనిని పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది.

 Saif Ali Khans Family Seeks Extension To Fight ₹15000 Crore Property Dispute I-TeluguStop.com

ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా కూడా మారింది.అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఆ దొంగ ఏమి తీసుకెల్ల లేదు కానీ అతడి కత్తి మాత్రం సైఫ్ కు ఏకంగా రూ.15 వేల కోట్ల మేర నష్టాన్ని మిగిల్చే ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది.కత్తి అని వేల కోట్లు నష్టాన్ని మిగిల్చడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే.కోర్టు సైఫ్ పట్ల సానుకూలంగా స్పందించకపోతే మాత్రం అతడికి అక్షరాలా రూ.15 వేల కోట్ల మేర నష్టం వాటిల్లడం ఖాయం.కాగా హీరో సైఫ్ రాజ కుటుంబానికి చెందిన వాడని తెలిసిందే.మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అలియాస్ టైగర్ పటౌడీ కుమారుడే సైఫ్ అలీఖాన్.

Telugu Assets, Bollywood, Saif Ali Khan, Saifali-Movie

తల్లి, సైఫ్ నానమ్మ సాజిదా సుల్తాన్ బేగం( Sajida Sultan Begum ) ఇంకా బతికే ఉన్నారు.మనవడు సైఫ్ కు కత్తి పోట్ల కారణంగా ఆమె షాక్ కు గురై అనారోగ్యం పాలయ్యారు.ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.సాజిదాకు ఒక అక్క అబీదా సుల్తాన్ బేగం కూడా ఉన్నారు.వీరి తండ్రి ముహమ్మద్ హమీదుల్లాహ్, భోపాల్ కేంద్రంగా పాలన సాగించిన పటౌడీ సామ్రాజ్యానికి చివరి సుల్తాన్.హమీదుల్లాహ్ బతికుండగానే ఆయన పెద్ద కుమార్తె అబీదా పాకిస్తాన్ వెళ్లిపోయారు.

ఆ తర్వాత చిన్న కుమార్తెతో కలిసి భారత్ లోనే ఉండిపోయిన హమీదుల్లాహ్( Hamidullah ) 1960లో మరణించారు.ఈ లెక్కన చూసుకుంటే అప్పటికే పాక్ వెళ్లిపోయిన తన సోదరి కాకుండా తండ్రితో కలిసి దేశంలోనే ఉండిపోయిన తానే తన తండ్రి ఆస్తులకు వారసురాలిని అని ఆ మేరకు తీర్మానం చేయాలని సాజిదా భారత ప్రభుత్వాన్ని కోరారు.

Telugu Assets, Bollywood, Saif Ali Khan, Saifali-Movie

ఈ ప్రతి పాదనకు సమ్మతిస్తూ భారత ప్రభుత్వం కూడా 1962లోనే ఆర్డర్ పాస్ చేసింది.ఫలితంగా హమీదుల్లాహ్ ఆస్తులకు చట్టబద్ధంగా సాజిదా అంటే సైఫ్ నానమ్మే సిసలైన వారసురాలు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్( Uttar Pradesh, Madhya Pradesh ) లలోని పలు ప్రాంతాల్లో పటౌడీ రాజవంశానికి రూ.15 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయట.ఈ ఆస్తులు సాజిదాకే చెందాలి.అయితే మోదీ సర్కారు వచ్చిన తర్వాత 2017లో ఈ తరహా ఆస్తులకు సంబంధించి ఒక కీలక ఉత్తర్వు జారీ అయ్యింది.దీని ద్వారా అమలులోకి వచ్చిన భారత శత్రు ఆస్తుల పరిరక్షణ సంస్థ కు ఈ ఆస్తులన్నీ చెందుతాయని కేంద్రం వాదిస్తోంది.ఎందుకంటే హమీదుల్లాహ్ పెద్ద కుమార్తె అబీదా పాక్ వెళ్లిపోయారు కాబట్టి, ఆమెను శత్రు దేశ పౌరురాలిగా పరిగణిస్తున్నామని, ఆమెకు చెందే ఈ ఆస్తులు కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వానివేనని కేంద్రం చెబుతోంది.

అయితే కేంద్రం వాదన తప్పు అని, ఇదివరకే కేంద్రం ఈ ఆస్తులు తమవేనని ఒక ఆర్డర్ కూడా జారీ చేసిందని చెబుతూ సాజిదా కోడలు, పటౌడీ సతీమణి షర్మిలా ఠాకూర్ మద్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.కేంద్రం తెచ్చిన ఈ కొత్త చట్టం తనకు వర్తించదని ఆమె వాదిస్తున్నారు.

ఈ కేసులో ఇంకా తుది తీర్పు రాలేదు.అయితే ఇటీవలే ఈ కేసులో కేంద్రం తన వాదనను వినిపిస్తూ పటౌడీ ఫ్యామిలీ ఏది చెప్పాలనుకున్నా ముంబైలోని సీఈపీఐ అప్పీలేట్ కోర్టులో చెప్పుకోవాలని కోరింది.

కేంద్రం వాదనతో ఏకీభవించిన ఎంపీ హైకోర్టు కూడా ఈ వివాదాన్ని సీఈపీఐలో తేల్చుకోవాలని అందుకు 30 రోజుల గడువు ఇస్తున్నట్లు ఇటీవలే తీర్పు చెప్పింది.ఆ గడువు తాజాగా శుక్రవారంతో ముగిసింది.

అయితే సైఫ్ ఇంటిలో చోరీ యత్నం, అతడిపై కత్తిపోట్లతో అతడి కుటుంబం ఆసుపత్రిలో ఉండిపోయింది.తీరా సైఫ్ ఇంటికి చేరుకోగానే, ఆయన నానమ్మ అనారోగ్యానికి గురయ్యారు.

ఈ హడావిడిలో పడి సైఫ్, సీఈపీఐని ఆశ్రయించే విషయాన్నే మరిచిపోయారు.న్యాయ వాదులు గుర్తు చేద్దామన్నా కుదరలేదు.

దీంతో ఇప్పుడు సీఈపీఐని ఆశ్రయించేందుకు మరింత గడువు కావాలని హైకోర్టును కోరేందుకు సైఫ్ ఫ్యామిలీ సిద్ధమైంది.వీరి అభ్యర్థనను కోర్టు మన్నిస్తే రూ.15 కోట్ల ఆస్తులపై పోరాటం చేసే అవకాశం సైఫ్ కు ఉంటుంది.లేదంటే ఆ ఆస్తులను అతడి ఫ్యామిలీ వదులుకోక తప్పదన్న మాట.మరి ఇంత ఆస్తి సైఫ్ కు వస్తుందా లేదంటే ప్రభుత్వానికి వెళుతుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube