రొమేనియాలో షాకింగ్ ఘటన.. మహిళా యజమానిని పీక్కుతిన్న పెంపుడు కుక్కలు..

రొమేనియా ( Romania )రాజధాని బుకారెస్ట్‌లో ఓ హార్ట్ బ్రేకింగ్ సంఘటన చోటు చేసుకుంది.34 ఏళ్ల అడ్రియానా నీగో ( Adriana Neego )అనే మహిళ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆ తర్వాత ఆమె పెంపుడు కుక్కలు ఆమె శరీరాన్ని పీక్కు తిన్నాయి అడ్రియానా కొన్ని రోజులుగా ఫోన్లకు, మెసేజ్‌లకు స్పందించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లారు.తలుపులు ఎంత కొట్టినా తెరవకపోవడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

 Shocking Incident In Romania, Pet Dogs Biting The Female Owner, Bucharest, Woman-TeluguStop.com

వారు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగానే భయానక దృశ్యం కనిపించింది.

అడ్రియానా మృతదేహం నేలపై పడి ఉండగా, ఆమె శరీరం కొంత భాగం తినేయబడి ఉంది.దాని పక్కనే ఆమె పెంచుకుంటున్న రెండు పగ్ జాతి కుక్కలు( Pug dogs ) ఉన్నాయి.

అడ్రియానా మరణించిన తర్వాత ఆకలితో అలమటించిన కుక్కలు ఆమె శరీరాన్ని తినడం ప్రారంభించాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించకపోవడంతో, ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.

Telugu Adriana Neagoe, Bucharest, Dog, Gruesome, Pet Dogs, Pet Dogs Female, Pets

ఈ విషాదకర ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన అధికారులు వెంటనే ఆ రెండు పగ్ జాతి కుక్కలను రక్షించి యానిమల్ షెల్టర్‌కు తరలించారు.అడ్రియానా మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.సోషల్ మీడియా వేదికగా ఆమెకు సంతాపం తెలుపుతూ భావోద్వేగపూరిత పోస్టులు పెడుతున్నారు.“నా అందమైన సోదరి అండా సాషా ఇక లేదు.మరో ఏంజెల్ స్వర్గానికి వెళ్లిపోయింది” అంటూ ఆమె సోదరి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం అందరినీ కలిచివేసింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక చర్చిలో అడ్రియానా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Telugu Adriana Neagoe, Bucharest, Dog, Gruesome, Pet Dogs, Pet Dogs Female, Pets

ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2013లో యూకేలోని హాంప్‌షైర్‌లో 56 ఏళ్ల మహిళ కూడా తన ఇంట్లోనే మరణించగా, ఆమె పెంపుడు జంతువులు ఆమె శరీరాన్ని తినేశాయి.కొన్ని రోజులుగా ఆమె కనిపించకపోవడంతో పాటు ఇంటి ముందు లెటర్ బాక్స్ నిండిపోవడంతో అనుమానమోచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా వంటగదిలో కొన్ని జంతువులు యజమాని శరీరాన్ని తింటూ కనిపించాయి.

ఆకలితోనే అవి అలా చేసుంటాయని అధికారులు అప్పట్లో తెలిపారు.శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం, పిల్లులు, కుక్కలు విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు మనిషి మృతదేహాన్ని కూడా తినేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube