కెనడాలో సిక్కు గార్డు పంచ్ పవర్.. ఒక్క గుద్దుతో దుండగుడు ఖతం.. వీడియో వైరల్!

కెనడాలో( Canada ) ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

 In Canada, The Video Of The Sikh Guard's Punch Power Killing The Thug With One P-TeluguStop.com

@Gharkakalesh అనే ట్విట్టర్ అకౌంట్‌ షేర్ చేసిన ఈ వీడియోలో, ఒక ఇండియన్ సెక్యూరిటీ గార్డు ( Indian Security Guard )టోపీ పెట్టుకున్న వ్యక్తితో గొడవ పడ్డాడు.అసలేం జరిగిందో తెలియదు కానీ, వీడియో స్టార్ట్ అవ్వగానే ఒక వ్యక్తి సెక్యూరిటీ గార్డుని గుద్దడం చూడొచ్చు.

అయితే, మన సెక్యూరిటీ గార్డు ఊరుకుంటాడా ఏంటి, వెంటనే రియాక్ట్ అయ్యి, తిరిగి ఫైట్ చేశాడు.బాక్సింగ్ రింగ్ లో దిగిన ఫైటర్ లాగా రెచ్చిపోయాడు.క్షణాల్లో ఆ వ్యక్తిని డామినేట్ చేసి గేటు బయటకు గెంటేశాడు.మన ఇండియన్ స్పీడ్ రియాక్షన్, కూల్ గా సిట్యుయేషన్ హ్యాండిల్ చేసిన విధానం అందరినీ ఇంప్రెస్ చేశాయి.

వీడియో చూసిన వాళ్లంతా సెక్యూరిటీ గార్డుకి ఫిదా అయిపోయారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.చాలామంది గార్డు ధైర్యాన్ని, ఫైటింగ్ స్కిల్స్‌ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఒక యూజర్ అయితే ఫన్నీగా కామెంట్ చేస్తూ, “సర్దార్జీ సెక్యూరిటీ చెక్‌ని భంగ్రా డాన్స్-ఆఫ్‌గా మార్చేశాడు” అని అన్నాడు.ఇంకొక నెటిజన్ మాత్రం ఇంకాస్త సీరియస్‌గా, “సర్దార్ జీ ఇండియా తరపున రివెంజ్ తీసుకుంటున్నాడు” అంటూ కామెంట్ పెట్టాడు.

కొందరైతే ఏకంగా “నెవర్ మెస్ విత్ ఎ సర్దార్ జీ” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఇక కెనడాలో పంజాబీలు ఎక్కువైపోయారనే విషయం తెలిసిందే కదా.దాని గురించి కూడా కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.“కెనడా పంజాబ్ అవ్వడం లేదు.ఇది ఆల్రెడీ పంజాబ్‌ కంటే ఎక్కువ పంజాబ్‌లా ఉంది” అని ఒక కామెంట్ వైరల్ అవుతోంది.మొత్తానికి ఈ వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube