ప్రేమ.ఈ రెండక్షరాల ఎంత పనైనా చూపిస్తుంది.ఇది ఎలా వస్తుందో, ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేరు.అందుకే ఈ మధ్య కాలం లో సెలెబ్రిటీ లు ఏ వయసులో అయినా ప్రేమలో పడటం చూస్తూనే ఉన్నాం.
ముఖ్యంగా లేటు వయసులో ఘాటు రొమాన్స్ చేయడానికి ఏమాత్రం విముఖత చూపడం లేదు.ఆలా ఏజ్ బార్ అయ్యాక ప్రేమలో పడిన సెలెబ్రిటీలు ఎవరో ఒకసారి చూద్దాం.
మొదటగా కిమ్ శర్మ-లియాండర్ పేస్
కిమ్ శర్మ.అందం.అభినయం ఉన్నా.అదృష్టం లేకపోవడంతో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.2010లో కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పంజాని కిమ్ పెళ్లి చేసుకుంది.కానీ తను అతడితో చాలా ఇబ్బందులు పడింది.
ఆర్థికంగా, మానసికంగా ఎంతో టార్చర్ అనుభవించింది.దీంతో 2016లో అతడితో విడిపోయింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సరైన తోడు దొరికింది.మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో పడింది.
ప్రస్తుతం లియాండర్ పేస్ కిమ్ తోనే కలిసి ఉంటున్నాడు.విదేశాల్లో వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.
పబ్బులు, రెస్టారెంట్లు అంటూ హుషారుగా గడుపుతున్నారు.ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు .
ఇక ఇదే దోవలో వచ్చే మరో సెలబ్రిటీ కపుల్ మిలింద్ సోమన్ అంకిత కొన్వార్

కాంట్రావర్సీ స్టార్ గా పేరు తెచ్చుకున్న మిలింద్ సోమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.ఆక్టర్ గా, మోడల్ గా మరియు యాభై ఏళ్ళు పై బడిన అద్భుతమైన ఫిట్ నెస్ కి పెట్టింది పేరుగా మిలింద్ సోమన్ ఎప్పుడు ప్రచారంలోనే ఉంటూ వచ్చాడు.ఇక మిలింద్ తనకన్నా 26 ఏళ్ళు చిన్నదైనా అంకిత కోన్వర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.
ఇక మరొక తమిళ స్టార్ హీరో ఆర్య మరియు సయేశా

హీరో ఆర్య వయసు 42 కాగా అతడు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న హీరోయిన్ సయేశా వయసు కేవలం 22 ఏళ్ళు.వీరిద్దరి మధ్య ఏకంగా 19 ఏళ్ళ వయసు తేడా ఉంది.ఇక కొన్ని రోజుల క్రితం వీరికి ఒక పాప కూడా పుట్టింది.
వీరి ప్రేమ పెళ్లి ప్రకటించిన తర్వాత కోలీవుడ్ అంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఇక చివరగా చెప్పుకోవాల్సిన మరొక వ్యక్తి టాలీవుడ్ లో విలన్ గా రాణించిన రాహుల్ దేవ్.
ఈయన వయసు ప్రస్తుతం 52 .ఒకసారి వివాహం జరిగాక రాహుల్ దేవ్ భార్య క్యాన్సర్ తో కన్ను మూసింది.ఇక ఆ తర్వాత రాహుల్ దేవ్ 35 ఏళ్ళ ముగ్ద గాడ్సే తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.లేట్ వయసులో వీరిద్దరూ ఘాటుగా రొమాన్సు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తున్నారు.